ఏడంతస్థుల పై నుంచి కిందపడిన కారు మహిళ సురక్షితం

ఏడంతస్థుల భవనంపై నుంచి ఏదైనా వస్తువును కింద పడేసి చూడండి.. దాని నామరూపాలు కూడా కనపడవు. అదే ఒక కారు అంతపై నుంచి కింద పడితే.. నుజ్జ నుజ్జు కాకుండా ఉంటుందా.. మరి ఆ కారులో ఉన్న వారు బతికే అవకాశాలు కూడా ఉండవు. కానీ.. ఓ మహిళ మాత్రం క్షేమంగా బయపటడింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

 వివరాల్లోకి వెళితే.. బీఎండబ్ల్యూ కారును పార్క్‌ చేయబోయేందుకు ప్రయత్నించిన మహిళ పొరపాటున ఎక్సలేటర్‌పై కాలు వేసింది. దాంతో ఒక్కసారిగా ఏడో అంతస్తులో ఉన్న పార్కింగ్‌ స్థలం నుంచి కారు కింద పడిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కారులో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ ఆమెకు ప్రాణాల మీదకు వచ్చేంత దెబ్బలు మాత్రం తగలకపోవడం గమనార్హం. జులై 13న ఈ ఘటన జరగగా దీనికి సంబంధించిన వీడియోను ఆస్టిన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది గురువారం విడుదల చేశారు. ఈ పార్కింగ్ ఇ లాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయట. గత సెప్టెంబర్ ఇలానే ఓ వ్యక్తి 9వ అంతస్థులో పార్కింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కాకపోతే.. కారు కింద పడిపోయినా.. అందులో వ్యక్తి మాత్రం అక్కడే ఉన్న తీగలను పట్టుకొని వేలాడుతూ బ్రతిబయటపడ్డాడు.