బ్లౌజ్ ఫ్రీ సారీ.. ఇదో కొత్త ఛాలెంజ్

Blouse-free saree challenge on Instagram catches users’ attention
Highlights

బ్లౌజ్ లేకుండా అందంగా చీర కట్టుకోవాలి

ఆ మధ్య కాలంలో.. ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’, ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ అంటూ.. సోషల్ మీడియాలో సెలబ్రెటీలు, యువతీయువకులు నానా హంగామా చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. గడ్డకట్టిన ఐస్ ముక్కలను ఒక్కసారిగా ఒంటిమీద పోసుకోవడం.. ఐస్ బకెట్ ఛాలెంజ్ కాగా.. ఒక బకెట్ రైస్ ని పేదవారికి పంచిపెట్టడం రైస్ బకెట్ ఛాలెంజ్. ఈ రెండు ఛాలెంజ్ లు ఆ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యాయి. కాగా.. ఇటీవల మరో ఛాలెంజ్ హల్ చల్ చేసింది. అదే బ్లౌజ్ ఫ్రీ సారీ. కాకపోతే ఇది మహిళలకు మాత్రమే.

ఇంతకీ ఈ ఛాలెంజ్ ఏమిటంటే.. మహిళలు తమకు నచ్చిన శారీని..బ్లౌజ్ లేకుండా ధరించాలి. అదీ అందంగానూ ఉండాలి.. అభ్యంతకరంగా ఉండకూడదు. అలా ధరించిన చీరతో ఫోటో దిగి.. వాటిని thesareefestival.com లింక్ చేసి.. శారీ, నో బ్లౌజ్ హ్యాట్ టాగ్ లు ఇచ్చి ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేయాలి. ఈ ఛాలెంజ్ ని ముంబయికి చెందిన కొందరు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టగా..చాలా మంది ఫాలో అయ్యారు. విత్ అవుట్ బ్లౌజ్ తో వివిధ రకాలుగా చీరలు కట్టుకొని.. ఫోటోలను షేర్ చేశారు. కాగా.. ఈ ఫోటోలు వైరల్ గా కూడా మారాయి.

loader