విజయవాడలో బ్లేడ్ గ్యాంగ్ ప్రత్యక్షమయింది. ఆ మధ్య ఈ గ్యాంగ్ నగరంలో పెద్ద సంచలనం సృష్టించింది.  కొద్ది రోజుల విరామం తర్వాత ఇపుడు మళ్లీ ఈ  గ్యాంగ్ మళ్లీ వార్తల కెక్కింది.  మరోసారి రెచ్చిపోయి బ్లేడ్ గ్యాంగ్  దారిన పోయే వారి మీద దాడి చేస్తూ ఉందని  బాధితులు చెబుతున్నారు. ఈ రోజు   ప్రసాదం పాడులో శివకుమార్ అనే యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. తనను బ్లేడు గాళ్లు  డబ్బులు అడిగారని, ఇవ్వనందుకు బ్లేడ్లు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని ఆయన చెబుతున్నాడు.  గంజాయి సేవించి తనపై దాడి చేశారని  బాధితుడు అనుమానిస్తున్నాడు. శరీరమంతా తీవ్రగాయాలతో బాధితుడుల ఇపుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్లేడ్  బ్యాచ్పదిమందికి పైగాఉన్నారని ఆయన చెబుతున్నాడు.