గుజరాత్ లో బిజెపి ఓడిపోతావుందని  ఒక బిజెపి ఎంపి కుండబద్దలు కొద్దినట్లు చెప్పి నాయకత్వాన్ని ఖంగుతినిపించారు. పోలింగ్ ముగిసిన రోజు చానెళ్లు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ జరిపి బిజెపిని గెలిపించారు.   కనీసం 25 నుంచి 30 సీట్ల మెజారిటీ ఇచ్చారు, క్యాంపెయిన్ టైంలో ఎదురయిన నిరాశను పొగోట్టేందుకు ప్రయత్నించారు. అయితే,  ఇవన్నీ ఫిక్స్ డ్   అని కపిల్ సిబల్ వంటి కాంగ్రెస్ నేతలు చెబుతూనే ఉన్నారు. ఇపుడు బిజెపి ఆశల మీద ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కాకడే నీళ్లు చల్లాడు. అంతగాడు బిజెపి ఓడిపోతుందని చెప్పాడు. వూరికే వూహించే చెప్పింది కాదు. ఆంధ్రా లగడపాడిలాగా ఆయనకు సర్వేలు చేయించే సరదా ఉంది. ఈ ఎన్నికల మీద పార్టీ తో నిమిత్తం లేకుండా ఒక సర్వే చేయించాడు. ఆ సర్వే ఫలితాలను విడుదల చేశాడు. ఈ ఫలితాల ప్రకారం, బిజెపికి ప్రభుత్వం ఏర్పాటచేసేంత మెజారిటీ రాదని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, కాంగ్ర7స్ పార్టీ  ప్రభుత్వం ఏర్పాటుచేసేంత దగ్గరగా జరుగుతుందని కూడా కాకడ్ చెప్పాడు.

 

ఒక వేళ చచ్చీ చేడి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదంతా ప్రధాని మోదీ చలవే అని కూడా ప్రశంసించారు.

తన సర్వే గురించి చెబుతూ‘ నేను ఆరుగురుసభ్యలతో ఒక టీమ్ ఏర్పాటుచేశారు. వాళ్లంతా గ్రామీణ ప్రాంతాలలో తిరిగారు. అక్కడ రైతులు, డ్రైవర్లు, కూలీలు తదితరులతోవారు మాట్లాడారు. వాళ్లసర్వే ప్రకారం, నా పరిశీలనలప్రకారం,  గుజరాత్ లో బిజిపికి సంపూర్ణ మెజారిటీ రావడం లేదు,’ అని చాలా ధైర్యంగా విషయం బయటపెట్టాడు. తన సర్వే  చాలా సైంటిఫిక్ అని, ఫలితాలు కచ్చితంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. సర్వే ఫలితాల గురించి ఇలాంటి క్రెడిబిలిడి ఉన్న నాయకుడు మనకు తెలిసి ఒక్క లగడపాటి రాజగోపాలే.

గుజరాత్ లో బాగా యాంటి ఇంకంబెన్సీ (ప్రభుత్వ వ్యతిరేక) బాగా ఉందని కూడా కాకడే చెప్పారు. వరుసగా 22 సంవత్సాల పాటు బిజెపి ఇక్కడ అధికారంలో ఉంది.బెంగాల్ కమ్యూనిస్టుల(25 సంవత్సరాలు) తర్వాత ఇలా ఇంతకాలం ఏ పార్టీ అధికారంలో లేదని కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే కారణమని ఆయన చెబుతున్నారు.