దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణ

First Published 15, May 2018, 2:12 PM IST
bjp wins karnataka
Highlights

 దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణ

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించడంతో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణ మారు మోగుతుంది.  పార్టీ ఆఫీసులకు భారీగా చేరుకున్న కార్యకర్తలు, నేతలు నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, రవిశంకర్‌ ప్రసాద్‌లు ఒకరికొకరు స్వీట్లతో కర్ణాటక విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఫలితాల్లో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్‌  ఫిగర్‌(112) దాటగా.. కాంగ్రెస్‌ 67, జేడీఎస్‌ 41 స్థానాలకు పరిమితమయ్యాయి.

loader