బైపోల్ రిజల్ట్స్ లైవ్: కైరానాలో ఆర్ఎల్డీ విజయం, బిజెపికి షాకిచ్చిన విపక్షాలు

BJP Trails In UP's Kairana, Leads In 2   Maharashtra Seats: 10 Facts
Highlights

బైపోల్ రిజల్ట్స్: బిజెపికి షాక్

న్యూఢిల్లీ: దేశంలోని 4 పార్లమెంట్, 11 అసెంబ్లీ స్థానాలకు  
ఇటీవల జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం నాడు సాగుతోంది. నాలుగు పార్లమెంట్ స్థానాల్లో  ఒక్క స్థానంలో బిజెపి ఆధిక్యంలో  ఉండగా, మిగిలిన మూైడు  స్థానాల్లో ఆర్ ఎల్డీ, ఎన్‌డిపిపి, ఎన్సీపీ   ఆధిక్యంలో నిలిచారు. యూపీలోని కైరానా ఎంపీ స్థానంలో బిజెపికి షాకిస్తూ ఆర్‌ఎల్డీ అభ్యర్ధి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

దేశంలోని 4 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బిజెపికి విపక్షాలు గట్టి షాకిచ్చాయి. పాల్ఘాడ్ ఎంపీ స్థానంతోనే బిజెపి సరిపెట్టుకంది. మిగిలిన మూడు సిట్టింగ్ స్థానాలను ఆ పార్టీ కోల్పోయింది. మరోవైపు 11 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఉత్తరాఖండ్ లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. మిగిలిన పది స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు, ఇతరులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు.

 

మేఘాలయ రాష్ట్రంలోని అంపటి స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు. మహేస్తలలో టీఎంసీ విజయం సాధించింది. సీపీఎం ను నెట్టివేసి బిజెపి రెండో స్థానంలో నిలిచింది..మహరాష్ట్రలోని పాలస్ కడేగావ్ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది.కర్ణాటకలోని రాజరాజేశ్వరీ నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.కేరళ రాష్ట్రంలోని చెంగన్నూరులో సీపీఎం విజయం సాధించింది.యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ స్థానంలో ఎస్పీ అభ్యర్ధి తన సమీప బిజెపి అభ్యర్ధిపై విజయం సాధించారు. సిట్టింగ్ స్థానాన్ని బిజెపి కోల్పోయింది.బీహర్ రాష్ట్రంలోని జోకిహాట్ స్థానంలో అధికార జెడి(యూ) సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈ స్థానంలో ఆర్జేడీ అభ్యర్ధి సుమారు 10 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.సిల్లీ స్థానంలో జెఎంఎం అభ్యర్ధి విజయం సాధించారు. గోమియా స్థానంలో కూడ జెఎంఎం అభ్యర్ధి విజయం సాధించారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తరలి అసెంబ్లీ స్థానంలో బిజెపి విజయం సాధించింది. పంజాబ్ రాష్ట్రంలోని షాకోట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు.

 

 

 


ఎంపీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పార్టీలు

కైరానా (యూపీ): ఆర్‌ఎల్డీ విజయం
పాల్ఘడ్(మహరాష్ట్ర):బిజెపి విజయం
భండారా-గోండియా(మహారాష్ట్ర):  ఎన్‌సీపీ
నాగాలాండ్(నాగాలాండ్): ఎన్‌డిపిపి

అసెంబ్లీ స్థానాల్లో అధిక్యంలో ఉన్నపార్టీలు

రాజరాజేశ్వరి నగర్( కర్ణాటక): కాంగ్రెస్ విజయం
నూర్పూర్(యూపీ):    సమాజ్‌వాదీ పార్టీ విజయం
మహేస్తల(బెంగాల్):  టీఎంసీ  విజయం
పాలస్ కడేగావ్(:మహారాష్ట్ర) కాంగ్రెస్ విజయం
చెంగన్నూర్(కేరళ):  సీపీఎం విజయం
ఆంపటి(మేఘాలయ):  కాంగ్రెస్  విజయం
షాకోట్(పంజాబ్):కాంగ్రెస్ విజయం
జోకిహట్(బీహార్): ఆర్జేడీ విజయం
గోమియా(జార్ఖండ్) ; జెఎంఎం విజయం
సిల్లీ(జార్ఖండ్):జెఎంఎం విజయం
తరలి(ఉత్తరాఖండ్):బిజెపి విజయం
 

 

loader