బిజెపి తెలుగు లెక్క ఏమిటో తెలుసా?

First Published 12, Dec 2017, 3:33 PM IST
BJP simple math for telugu states
Highlights

చాలా సింపుల్ గుజరాత్ లెక్క మీద ఆధార పడి ఉంటుంది

భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో 2019 కోసం ఎలాంటి వ్యూహం తయారుచేసుకుంటున్నది?  పైకి చాలా జటిలమైన ప్రశ్న లాగా  కనిపిస్తుంది.ఈ రెండు రాష్ట్రాలలో బిజెపి మరుగుజ్జులాగా  ఉంటున్నది. ఎదుగు బొదుగు లేదు. టిడిపితో పోత్తు పెట్టుకుంటే ఆంధ్రలో నాలుగు సీట్లొస్తాయి. లేకుంటే అడ్రసుండదు.

తెలంగాణలో కూడా అంతే. పొత్తు లేకుంటే పత్తా ఉండదు. అందుకే  ఈ రెండు రాష్ట్రాలు బిజెపి కి చాలా అవసరం. దక్షిణాది  తమిళనాడు దూరేందుకు ఎఐఎడిఎంకె తో చేతులుకలిపింది. కేరళలో కూడా ఏదో కష్టాలు పడుతూ ఉంది. కర్నాటకలో బాగానే ఉంది.  అంధ్రలో  టిడిపి సహాయం ఉంది. అది చాలా వీక్ గా ఉంది.

అందువల్ల  రెండు రాష్ట్రాలలో రూలింగ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే మార్గమని బిజెపిలో ఒక వర్గం భావిస్తున్నది.  ఈ విషయంలో ఎలా ముందు కెళ్లాలిఅనేది పార్టీలలో నలుగువస్తున్న ఒక ప్రశ్న.

దీనికి ఆంధ్ర బిజెపి నాయకుడొకరు ఒక సింపుల్ లెక్క వేసి చెప్పారు. ఆయన లెక్క ప్రకారం అన్నింటికి గుజరాత్  ఎన్నికలు ముఖ్యం. ’ గుజరాత్ లో మళ్లీ బిజెపి గెల్చి మోదీ హవా కొనసాగితే, మాదగ్గిరకు అటు టిడిపి, ఇటు టిఆరఎస్ పొత్తు కోసం పరిగెత్తు కుంటూ వస్తారు. అలా కాకుండా అక్కడేదయిన అవాంఛనీయ పరిణామాలు జరిగితే, వాళ్ల దగ్గిరకు మేం పరిగెత్తుకుంటూ వెళతాం,’ అని చెప్పారు.

 తెలుగు రాష్ట్రాల బిజెపి సింపుల్ మ్యాథ్ ఇదే అని అయన అన్నారు, ఆప్ ది రికార్డ్ అంటూ... 

 

loader