కర్ణాటక ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఓట్ల లెక్కింపు దగ్గర నుంచి ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా 104 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీ 78, జేడీఎస్‌ 36 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల నాటకీయ పరిణామాల తర్వాత అతిపెద్ద పార్టీ అయిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించారు. దీంతో ఈరోజు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

అయితే.. నెల రోజుల్లో బీజేపీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిస్థితులు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డారు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు.

ఇప్పటికే.. బీజేపీ  ప్రలోభాల పనిలో పడిందని జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలను వారి పార్టీలోకి ఆహ్వానించేందుకు మంత్రి పదవితోపాటు రూ.100కోట్లు బేరం ఆఫర్ చేశారని జేడీఎస్ నేత కుమార స్వామి ఆరోపించారు.