కూడా భాజపాకు కాంగ్రెస్-ఎస్పీ, బిఎస్పీలకు మధ్య బాగా వ్యత్యాసం కనబడుతోంది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ జోస్యం నిజమయ్యేట్లే కనబడుతోంది. ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ఒక్క పంజాబ్ మినహా మిగిలిన ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో మోడి హవా బాగానే కనబడుతోంది. ఇప్పటికి ఫలితాలేవీ రాలేదు. వస్తున్నవన్నీ మెజారిటీలే. అయినా మెజారిటీల్లో కూడా భాజపాకు కాంగ్రెస్-ఎస్పీ, బిఎస్పీలకు మధ్య బాగా వ్యత్యాసం కనబడుతోంది. బహుశా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? లేక ట్రెండ్ తిరగబడుతుందా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. వరుస చూస్తుంటే, ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలే బాగా కనబడుతున్నాయి. అంటే, నోట్ల రద్దు లాంటి అంశాలేవీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం కనబడలేదనే అనుకోవాలేమో.
