పోలవరం ప్రాజెక్టు.. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది అంచనా వ్యయం పెరిగినా పర్లేదు.. కంట్రాక్టర్ ని మార్చాలని తాజాగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఒకరు ఎడ్డెం అంటే.. మరొకరు తెడ్డెం అంటున్నారని ఇరు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు.. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ని మారిస్తే తప్ప పనులు కావని చంద్రబాబు..అంచనా వ్యయం పెరుగుతుంది కాబట్టి కాంట్రక్టర్ ని మార్చడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వం ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అంచనా వ్యయం పెరిగినా పర్లేదు.. కంట్రాక్టర్ ని మార్చాలని తాజాగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆ నిర్ణయమే ఇరు పార్టీల మధ్య చిచ్చు పెడుతుందేమోనని పలువురు భావిస్తున్నారు. ఇదే విషయంపై మంగళవారం మీడియా తో మాట్లాడిన బీజేపీ నేత పురందేశ్వరి.. చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు.

అసలేం జరిగిందంటే..2019 ఎన్నికల సయమానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. ఇందు కోసం ప్రాజెక్టు కాంట్రక్టర్ ని మార్చాలని చంద్రబాబు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయగా.. కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. కాంట్రాక్టర్ ని మారిస్తే పెరిగే అంచనా వ్యాయాన్ని తాము భరించలేమని కేంద్రం చేతులెత్తేసింది.అయినప్పటికీ.. కాంట్రాక్టర్ ని మార్చి తీరాలని చంద్రబాబు నిశ్చయించుకున్నారు.
కాగా ఈ విషయంపై పురందేశ్వరి మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్టుకు సింగిల్ కాంట్రాక్టర్ అయితే.. చాలా త్వరగా పనులు పూర్తౌతాయని అన్నారు. సామర్థ్యంలేని ట్రాన్ స్ట్రాయ్ కంపెనీకి అనుమతిలిచ్చి.. ఇప్పుడు కాంట్రాక్టర్ ని మారుస్తాననడం సరైన నిర్ణయం కాదన్నారు. అలా చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని.. కాంట్రాక్టర్ అర్హతను ముందే తెలుసుకుని ఉండాల్సిందని అన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత పురందేశ్వరి ఉప్పు-నిప్పులా తయారయ్యారని, ఒకరు ఎడ్డెం అంటే.. మరొకరు తెడ్డెం అంటున్నారని ఇరు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
