ఇప్పటికే విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు ఇదే విషయాన్ని ఓ కుక్కపిల్ల చెప్పడం విశేషం.

దేశవ్యాప్తంగా గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మళ్లీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందా లేదా.. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పైచేయి సాధిస్తుందా అనే అంశంపై సర్వత్రా చర్చజరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు ఇదే విషయాన్ని ఓ కుక్కపిల్ల చెప్పడం విశేషం. గుజరాత్ లో ఎవరు గెలుస్తారో ఈ వీడియోలోని కుక్క పిల్ల చెబుతోంది.

వీడియోలో ఓ యువతి చిన్న కుక్కపిల్లని ఎత్తుకుని ‘మోదీ గుజరాత్‌ వస్తున్నారా’ అని అడిగింది. ఇందుకు ఆ కుక్కపిల్ల చేతులు వూపుతూ స్పందించింది. కానీ రాహుల్‌ గుజరాత్‌ వస్తున్నారా, కాంగ్రెస్ గుజరాత్ వస్తున్నారా అని అడిగితే మాత్రం ఏమీ స్పందించలేదు. ఈ వీడియోని భజపా నేత అమిత్‌ మాల్వియా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ క్యూట్‌ కుక్కపిల్లకి అన్నీ తెలుసు’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Scroll to load tweet…