గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే...

గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే...

మొత్తానికి గుజరాత్ లో బిజెపి వచ్చే సూచనలుస్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రోజు పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం ఇది. అయితే, కాంగ్రెస్ పనితీరు బాగా మెరుగుపడిందనే చెప్పక తప్పదు. గుజరాత్ ఎన్నికల చాలా ఉత్కంఠ భరితంగా సాగాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీల మధ్య చాలా ఆసక్తి కరమయిన మాటల యుద్ధం సాగించింది. ప్రధాని పెద్ద ఎత్తున  కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశారు. తనను తప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కు సుపారి ఇచ్చిందని కూడా చెప్పి  పెద్దవివాదం సృష్టించారు. ప్రధాని చాలా పెద్ద ఎత్తున గుజరాత్ లో ప్రచారం చేశారు. అంటే, బిజెపి కి ఈ ఎన్నికల ప్రతిష్టాకరమయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.  ఆయన ఏకంగా 35 ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు  రాహుల్ రెండు నెలలు పాటు ఆహారాత్రాలు శ్రమించారు. గుజరాత్ ఫలితాలు ఎలా ఉంటాయనేదానిపై వివిధ టీవీ ఛానల్స్, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ నిర్వహించాయి. ఫలితాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీలో ఉన్న స్థానాలు 182.  ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 92 స్థానాలు గెలుపొందాలి.

ఇవి ఫలితాలు:

టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ : బీజేపీ : 109, కాంగ్రెస్ 70, ఇతరులు : 3

సీ-ఓటర్ సర్వే : బీజేపీ : 108, కాంగ్రెస్ : 74

రిపబ్లిక్ టీవీ సర్వే : బీజేపీ : 108, కాంగ్రెస్ : 74

   ఎన్ డి టివి సర్వే : బీజేపీ : 115, కాంగ్రెస్ : 65, ఇతరులు : 2

ఇండియా టుడే సర్వే : బీజేపీ : 99-113 , కాంగ్రెస్ : 68-82, ఇతరులు : 1-4 సీట్లు

సహార సమయ్ సర్వే : బీజేపీ : 110-120, కాంగ్రెస్ : 65-75, ఇతరులు : 02-04

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page