బిజెపి, వామపక్షాల మధ్య గొడవతో విశాఖ ఉద్రిక్తత ( వీడియో )

First Published 12, Apr 2018, 1:05 PM IST
BJP and left parties clash in Vizag
Highlights
బిజెపి, వామపక్షాల మధ్య గొడవత్ విశాఖ ఉద్రిక్తత ( వీడియో )

విశాఖలో పార్లమెంటు సభ్యుడు హరిబాబు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్లమెంట్‌ను ప్రతిపక్షాలు స్తంభింపజేసినందుకు నిరసనగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కడికక్కడే దీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే.... దీక్షా శిబిరం వద్దకు పలువురు సీపీఐ, కార్యకర్తలు చేరుకుని ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే బీజేపీ, సీపీఐ కార్యకర్తల మధ్య తోపులాట పరస్పర దాడులు జరిగాయి. పోలీసులు ఇరు వర్గాలును  చెదరగొట్టి,సిపిఐ నాయకులును అరెస్టు చేశారు

 

loader