ప్రాణాలకు తెగించి మరీ హోంవర్క్ (వీడియో)
ఓ చిన్నారి ప్రాణాలకు తెగించి మరీ హోంవర్క్ చేస్తున్న వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇచ్చిన హోమ్‌వర్క్ చేయడం మర్చిపోతే ఏం చేస్తాం.. అమ్మ బ్రేక్‌ఫాస్ట్ తినిపించే సమయంలోనో.. లేదా ఏదైనా క్లాస్ ఖాళీగా ఉన్న సమయంలోనైనా చకాచక ముగించేస్తాం.
నడుస్తున్న ట్యాక్సీలో నుంచి బయటికి కూర్చుని, కారు టాప్‌ను డెస్క్‌గా మార్చుకుని తన హోమ్‌వర్క్ ముగించేయాలని చూసింది. డ్రైవర్ సీట్‌లో కూర్చుని ట్యాక్సీ నడుపుతున్న ఆ అమ్మాయి తండ్రి తన స్నేహితుడితో మాట్లాడుతూ ఆ విషయాన్ని గమనించలేదు. అయితే ఈ కారును ఫాలో చేస్తున్నవారు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అనుక్షణం కనిపెట్టుకోవాలని చివాట్లు పెట్టారు.

