హాల్ టికెట్ పై యువతి అర్ధనగ్న ఫోటో

Bihar university issues admit card with bikini-clad woman’s photo
Highlights

ఖంగుతిన్న యువతి.. సర్వత్రా విమర్శలు

పరీక్షలు దగ్గరపడటంతో.. ఆన్ లైన్ లో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్న యువతి ఒక్కసారిగా ఖంగుతింది. తన పేరుతో ఉన్న హాల్ టికెట్ పై వేరే యువతి అర్థనగ్న ఫోటో ఉండటంతో ఆమె షాకయ్యింది. వెంటనే.. తనకు మరో హాల్ టికెట్ ఇవ్వాల్సిందిగా యూనివర్శిటీని డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..దర్భంగాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ లో మరికొద్ది రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ యూనివర్శిటీ అనుబంధ కాలేజీకి చెందిన ఓ యువతి.. పరీక్షల కోసం హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుంది. కాగా.. ఆ హాల్ టికెట్ లో మరో యువతి అర్థ నగ్న ఫోటో ఉంది. వర్శిటీ నిర్వాకంతో షాక్ తిన్న సదరు విద్యార్థిని అధికారులకు ఫిర్యాదు చేసింది. లలిత్ నారాయణ్ వర్సిటీ గుర్తింపు పొందిన మధుబని సమీపంలోని ఖాజేదీ ఎస్ఎంజే కాలేజ్‌లో హోం సైన్స్ చదువుతోన్న యువతి, తన అడ్మిట్ కార్డును తిరిగి జారీచేయాలని డిమాండ్ చేసింది.

ఈ వ్యవహారంపై బాధిత విద్యార్థిని మాట్లాడుతూ... మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షల కోసం శనివారం నాడు తాను హాల్ టిక్కెట్ నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన తర్వాత అందులో వివరాలు చూసి విస్తుపోయానని తెలిపింది. తన ఫోటోకు బదులు అర్థనగ్నంగా ఉన్న మరో యువతి ఫోటో ఉందని తెలిపింది. పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తును నింపినప్పుడు అన్ని వివరాలను సరిచూసుకున్న తర్వాతే పూర్తిచేశానని వాపోయింది. ఈ ఘటనపై వర్సిటీ ఎగ్జామినేషన్ విభాగాం అధికారి కులానంద్ యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి తప్పిదాలను సహించబోమని, తక్షణమే ఆ విద్యార్థినికి మరో అడ్మిట్ కార్డును జారీ చేయాలని ఆదేశించారు. కాగా ఈ విషయంపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. యూనివర్శిటీ అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

loader