బిహార్‌లో రెచ్చిపోయిన మానవమృగాలు

Bihar police arrests two in connection with molestation viral video case
Highlights

బిహార్‌లో రెచ్చిపోయిన మానవమృగాళ్లు 

బిహార్‌లో మానవమృగాళ్లు రెచ్చిపోయాయి. పైశాచికంగా ఇద్దరు యువతులపై కొందరు గ్రామస్తులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ ఘటనలు వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టగా.ఈ నెల 17, 18 తేదీల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి 

స్నేహితులతో వెళ్తున్న యువతులను అడ్డుకున్న కొందరు గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. వారితో ఉన్న వ్యక్తులను చితకబాది, ఆపై యువతుల దుస్తులను లాగి వారిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు.  ఆ ఘటనలను వీడియో తీసి వాట్సాప్‌ గ్రూప్‌లలో వైరల్‌ చేశారు. చివరకు వీడియోలు మీడియాకు చేరటం ద్వారా ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. 

కాగా, ఘటనలపై ఏఏస్పీ మిశ్రా స్పందించారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకుని సుధీర్‌, విజయ్‌ యాదవ్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశాం. మిగతా వారి కోసం గాలింపు చేపట్టాం.  బాధిత యువతులకు న్యాయం కలిగేలా చూస్తాం .. 

loader