మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

First Published 4, Jan 2018, 11:45 AM IST
big discounts on maruthi cars upto 30000
Highlights
  • నూతన సంవత్సరం సందర్భంగా భారీ ఆఫర్లు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి నూతన సంవత్సరం సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన కొన్ని మోడళ్లపై రూ.30వేల వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఆల్టో 800 మినీ కారుపై రూ.25,000, ఆల్టో కే10పై రూ.22,000, వ్యాగన్‌ ఆర్‌పై రూ.35,000 వరకు ధరల్లో తగ్గింపును మారుతీ అందిస్తోంది. అమ్మకాలను పెంచుకునేందుకు డిసెంబరులో కూడా వ్యాగన్‌ ఆర్‌, ఆల్టో ధరలను రూ.35,000 వరకు కంపెనీ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం వల్లేనేమో డిసెంబరులో చిన్న కార్ల అమ్మకాలు 2 శాతం పెరిగాయి.

సెడాన్‌ సియాజ్‌ ధరలోనూ రూ.30,000 వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ కారు అమ్మకాలు డిసెంబరులో 36 శాతం వరకు తగ్గడం గమనార్హం. ఇక ఇగ్నిస్‌పై రూ.30000 వరకు, ఎర్టిగా, సూపర్‌ క్యారీపై రూ.20,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. అమ్మకాలు మందగించిన మోడళ్ల కార్లపై మాత్రమే ఆఫర్లు ప్రకటించడం గమనార్హం. కస్లమర్లను ఆకట్టుకునేందుకు నూతన సంవత్సరంలో మారుతి ఈ తరహా ఆఫర్లను ప్రకటించింది.

 

loader