అమేథి నగరపంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో విజయం 

ఉత్తర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి అనూహ్యమయిన షాక్ తగిలింది. పార్టీకి ఎప్పటినుంచో విధేయంగా నిలిచిన అమేధీ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అది కూడా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్న సమయంలో రాహుల్ కు ఈ దెబ్బ తగలడం విశేషం. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఏమి జరుగుతున్నదో పార్టీ సిరయస్ గా ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయమాసన్నమయిందని పరిశీలకులు భావిస్తున్నారు.

రాహుల్ ఎంపిగా ఉన్న అమేథి నగర పంచాయితీలో బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. వేయికి పైగా ఓట్ల తేడాతో బీజేపీ అమేథిలో గెలుపొందింది. అమేథి దశాద్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోట. అమేథి నగర పంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లనూ కాంగ్రెస్ పరాజయం పాలయింది. అమేథితో పాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌ బరేలీలోనూ బీజేపీ ఘనవిజయం సాధించడం కాంగ్రెస్ ను కృంగదీస్తుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.