రిపబ్లిక్ డే సందర్భంగా రిటైల్ స్టోర్స్ కూడా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకవైపు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ -కామర్స్ వెబ్ సైట్లు స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా  రిటైల్ స్టోర్ బిగ్ బజార్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమికి చెందిన రెడ్ మీ ఏ5 పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు బిగ్ బజార్ లో కేవలం రూ.4వేలకే అందుబాటులోకి వచ్చింది.

షియోమి రెడ్ మీ ఏ5 ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం అవుతోంది. ఓపెన్ సేల్ లో రెడ్‌మి 5ఏ 2జీబీ ర్యామ్‌ మోడల్ రూ.4999కు, 3జీ ర్యామ్‌ వేరియంట్‌ రూ.6,999కు అందుబాటులో ఉన్నాయి. కాగా.. ఇప్పుడు బిగ్ బజార్ లో 2జీబీ వేరియంట్ ఫోన్ ధర అన్ని ఆఫర్లు కలుపుకొని రూ.4వేలకే అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు.. షియోమి కంపెనీకి చెందిన  ఇతర మైబైల్స్, పవర్ బ్యాంకులపై కూడా బిగ్ బజార్ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుంది.