ప్రముఖ రీటైల్ వ్యాపార సంస్థ బిగ్ బజార్.. భారీ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని ఈ ఆఫర్ల మేళా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. రూ.5,000 విలువైన కొనుగోళ్లపై రూ.1,000  క్యాష్‌ బ్యాక్‌, రూ.2,500 రూపాయల విలువైన కొనుగోళ్లపై రూ.500  క్యాష్‌ బ్యాక్‌ వంటి ఆఫర్లను ప్రకటించింది. అనేక కేటగిరీల్లోని వస్తువులపై డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ‘‘ సబ్‌సే సస్తా 5 దిన్‌’’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  షాపింగ్‌ వేడుకలు నిర్వహించిన ప్రతిసారీ వినియోగదారుల నుంచి అసాధారణ స్పందన వస్తోందని సంస్థ సిఇఇ సదాశివ్‌ నాయక్‌ చెప్పారు.