ముగిసిన భూమా అంత్యక్రియలు

టీడీపీ నేత, నంద్యాల ఎంఎల్‌ఎ భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.

ఆశేష జనవాహిని వెంటరాగా అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

అంతకుముందు భూమా అంతిమ యాత్రకు వేలాది మంది అభిమానులు, టిడిపి కార్యకర్తలు తరలి వచ్చారు.

భూమా చితికి ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి నిప్పంటించారు. అంతిమయాత్రలో సీఎం చంద్రబాబునాయుడు, ఎంఎల్సీ నారా లోకేష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.