సభ్యసమాజం తలదించుకునే దారుణమైన ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళను రేప్ చేసి అత్యంత దారుణంగా చంపేశారు కొందరు దుండగులు. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన గురించి కళ్లు చెదిరే వాస్తవాలు బయటకువచ్చాయి. పోస్టుమార్టంలో మృతురాలి ప్రైవేట్ పార్ట్స్ నుంచి బీరు, కూల్ డ్రింక్ బాటిళ్లను డాక్టర్లు వెలికి తీశారు. ఇంతకీ ఎవరీ మహిళ? ఏం జరిగింది? అన్న డీటేల్స్‌లోకి వెళ్తే…

మృతురాలి సొంతూరు మధ్యప్రదేశ్‌.. సెహోర్ జిల్లా ఇచ్చావర్ టౌన్‌. 28 ఏళ్ల మహిళ.. మరో వ్యక్తితో కలిసి భోపాల్‌లోని ప్రగతి నగర్‌లో అద్దె ఇంట్లో వుంటోంది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ, ఆమె వున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులకు న్యూడ్‌గావున్న మహిళ డెడ్ బాడీ కనిపించడంతో షాకయ్యారు. రెండురోజుల కిందట దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్టు తెలుస్తోంది. ఐతే, పోస్టుమార్టం సందర్భంగా ఆమె రహస్య భాగాల నుంచి బీరు, సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లను బయటకు తీశారు డాక్టర్లు. ఘటన తర్వాత ఆమెకి భర్తగా చెబుతున్న వ్యక్తి అదృశ్యకావడంతో అతడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ కేసు భోపాల్ పోలీసులకు సవాల్‌గా మారింది.