డబుల్ బెడ్ రూం ఇళ్లలో అన్నీ లోపాలే...

First Published 27, Nov 2017, 5:02 PM IST
bhatti says TRS government 2bhk are substandard and people are worried
Highlights

ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్య ధోరణి , బాధ్యతారాహిత్యం స్పష్టం

 

మధిర నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఇపుడు నియోజకవర్గ  పరిధిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చింతకాని మండలం నాగులవంచకు చెందిన రైల్వే స్టేషన్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించారు. ఇళ్ళ నిర్మాణం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. ఈ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్య దోరణి , బాధ్యతారాహిత్యం స్పష్టంగా కన్పిస్తుందన్నారు. మట్టి, ఇసుకతో కడుతున్నట్టు గా ఉందన్నారు. అందులోనూ రోడ్డు లెవెల్ కన్నా మరీ లోతట్టు ప్రాంతంలో జరుగుతున్న ఈ ఇళ్ళ నిర్మాణం ప్రభుత్వ అనాలోచిత విధానాలకు అర్థం పడుతుంది.  పునాదులేకుండా నిర్మించే ఇళ్ల
 మనుగడ ప్రశ్నార్థకమన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాణ దశలోనే కూలిపోయేలా పనులు జరుగుతున్నా యి. ఈ ధోరణి మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గృహ నిర్మాణ శాఖ అజమాయిషీ పూర్తిగా లోపించిందన్నారు .  ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టో అర్థంకావడం లేదన్నారు.

loader