రోజుకి 2జీబీ డేటా.. ఎయిర్ టెల్ అతి చౌక ప్లాన్

రోజుకి 2జీబీ డేటా.. ఎయిర్ టెల్ అతి చౌక ప్లాన్


టెలికాం రంగంలో రోజురోజుకీ పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ఆయా టెలికాం సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  దీనిలో భాగంగానే ఎయిర్ టెల్ సంస్థ 249 రూపాయలకి సరికొత్త ప్లాన్ ప్రకటించింది. అలాగే ఇప్పటికే అందుబాటులో ఉన్న 349 రూపాయల ప్లాన్లో కూడా మార్పులుచేర్పులు చేసింది. 249 రూపాయల ప్లాన్ విషయానికొస్తే రోజుకి 2 జీబీ మొబైల్ డేటా చొప్పున 28 రోజుల పాటు వ్యాలిడిటీని ఇది కలిగి ఉంటుంది.


అలాగే అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకి వంద చొప్పున ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా అందించబడతాయి. అంటే 28 రోజులు మొత్తానికి కల్పి 56 జీబీ మొత్తంలో మొబైల్ డేటా లభిస్తుందన్న మాట. ఎయిర్ టెల్ సంస్థ రెండు రోజుల క్రితం ప్రకటించిన 499 రూపాయల దానికి భిన్నంగా ఈ 249 రూపాయల ప్లాన్ ఓపెన్ మార్కెట్ ప్లాన్ కావడం గమనార్హం.  మీ ఫోన్లోని మై ఎయిర్ టెల్ అప్లికేషన్లో ఈ కొత్త ప్లాన్ వివరాలు కనిపిస్తాయి. 


లేదా ఎయిర్ టెల్ వెబ్ సైట్  ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో అందిస్తున్న 198 రూపాయల ప్లాన్‌కి ఈ 249 రూపాయల ఎయిర్ టెల్  ప్లాన్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.ఇక రూ.349 ప్లాన్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 28 రోజుల వేలిడిటీతో మొత్తం 70 జీబీ మొబైల్ డేటా లభించేంది. ఇకపై అదే 28 రోజుల కాలానికి 84 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos