ఈనెల 28వ తేదీన ప్రతిపక్షాలు తలపెట్టిన భారత్ బంద్ ఉపసంహరించుకున్నట్లే కనబడుతోంది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలోని ప్రతిపక్షాలన్నీ కలిసి సోమవారం తలపెట్టిన భారత్ బంద్ ను ఉపసంహరించుకున్నట్లు సమాచారం అసలే డబ్బుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న జనాల వైపునుండి చూస్తే  భారత్ బంద్ పెద్ద భారమే.

ఎందుకంటే, శని, ఆది వారాలు బ్యాంకులకు శెలవు దినాలు. సోమవారం ప్రతిపక్షాలు భారత్ బంద్ కు గతంలో పిలుపునిచ్చాయి. చేతిలో డబ్బులు లేకుండా వరుసగా మూడు రోజుల వుండాలంటే ప్రజలు అల్లాడిపోతారన్న విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించాయి.

దాంతో తమలో తాము చర్చించుకుని కేవలం నిరసన మాత్రమే తెలపాలని నిర్ణయించుకున్నాయి. దాంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.