అనుష్క  ప్రస్తుతం ‘భాగ్ మతి’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం,  మళయాళం,హిందీ భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు చేస్తోంది

లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు అనుష్క చిరునామాగా నిలిచింది. అరుందతి, రుద్రమదేవి చిత్రాలను తన భుజాలపై మోసి విజయాలను తన జాబితాలో వేసుకున్న అనుష్క ప్రస్తుతం ‘భాగ్ మతి’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. బాహుబలి తర్వాత అనుష్క నుంచి వస్తున్న చిత్రం ఇదే. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం ప్రీ రిలీజ్ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. రూ.19కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా.. విడుదల కు ముందే ఈ చిత్రం రూ.40కోట్లు వసూలు చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అంతేకాకుండా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మళయాళం,హిందీ భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు చేస్తోంది. బాహుబలి చిత్రంతో ఉత్తరాదిన అనుష్కకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ని భాగ్ మతి చిత్ర బృందం ఉపయోగించుకోనుంది. ఈ చిత్ర హిందీ హక్కులను రూ.12.5కోట్లకు కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ కూడా సిద్ధంగా ఉన్నారట. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే..అనుష్క కోసం ప్రత్యేకం మరిన్ని కథలు సిద్ధమయ్యే అవకాశం ఉంది.