హైదరాబాద్ నగరానికి కేరాఫ్ అడ్రస్ ఇరానీ చాయ్. కమ్మని ఇరానీ చాయ్ కి కాంబినేషన్ గా ఉస్మానియా బిస్కెట్లు తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఇరానీ చాయ్ కి ఇంత ప్రాచుర్యం రావడానికి కారణం.. నగరాన్ని పాలించిన కుతుబ్ షాహీలే.తేనీరు ప్రపంచమంతా విస్తరిస్తున్న సమయంలోనే హైదరాబాద్ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు గోల్కొండ రాజధానిగాధానిగా పాలిస్తున్నారు.

ఇరాన్ నుంచి వచ్చి.. వీరు హైదరాబాదీలను పరిపాలించారు. కుతుబ్ షాహీలతోపాటు.. వారి పరివారం కూడా వచ్చి నగరంలో స్థిరపడి.. వారి అభిరుచులను, సంస్కృతులకు మనకు పరిచయం చేశారు. వారి ద్వారానే ఇప్పుడు మనకు ఇరానీ చాయ్ పరిచయం అయ్యింది. ఇరానీచాయ్ కి ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా..? దీని రంగు, రుచి, తయారు చేసే విధానం అంతా స్పెషల్ గా ఉంటుంది. దీనికి వచ్చిన రుచి మరే టీకి రాదు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తూ ఉంటుంది. మరి హైదరాబాద్ లో ది బెస్ట్ ఇరానీ చాయ్ ఎక్కడ దొరుకుతుందో చూద్దామా...

 

1.కేఫే నిలోఫర్ అండ్ బేకర్స్..

ఇది లక్డీకపూల్ లో ఆంజనేయస్వామి టెంపుల్ కి సమీపంలో ఉంది. ఉదయం ఎనిమిదిగంటలకు తెరిస్తే.. మళ్లీ ఈ కేఫ్ మూతపడేది అర్థరాత్రి 12గంటలకు.  ఇక్కడ ఇరానీ చాయ్.. చాలా బాగుంటుంది. చాయ్ తోపాటు పలురకాల ఫుడ్ ఐటెమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. కుటుంబంతో వెళ్లి సరదాగా చాయ్ తాగి రావచ్చు.

2.లమకాన్...

ఈ కేఫ్ బంజారాహిల్స్ లోని జీవీకే మాల్ కి ఆపోజిట్ లేన్ లో ఉంది. ఈ కేఫ్ చూడటానికి ఒక బంగ్లాలా ఉంటుంది. వీకెండ్, వీక్ డే అనే తేడా లేకుండా ఎప్పుడూ ఫుల్ రష్ గా ఉంటుంది.  పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ దొరికిందంటే మీరు అదృష్టవంతులే.. అంతాలా ఉంటుంది రష్. కేవలం రూ.100 నుంచి రూ.150 ఖర్చు చేస్తే కడుపు నిండా తినవచ్చు. ఇరానీ చాయ్ తోపాటు కొన్ని లిమిటెడ్ ఫుడ్స్ దొరకుతాయి. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు తెరచి ఉంటుంది.

3. షాదాబ్..

హైకోర్టురోడ్డులోని మదీనారోడ్డుకి ఆపోజిట్ లో ఉంటుంది ఈ రెస్టారెంట్. ఇక్కడ కూడా ఇరానీ చాయ్ చాల టేస్టీగా ఉంటుంది. చాయ్ తోపాటు బిర్యానీ, మటన్ కబాబ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది.

4.కేఫే బహార్..

హైదర్ గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంది  ఈ కేఫ్ బహార్. పక్కా హైదరాబాద్ రుచులకు ఇది కేరాఫ్ అడ్రస్. ఉదయం 11గంటల నుంచి తెల్లవారుజామున 1గంట వరకు తెరచి ఉంటుంది.

5.తైబా బేకరీ  అండ్ కేఫే..

ఈ కేఫ్ లోనూ ది బెస్ట్ ఇరానీ చాయ్ లభిస్తుంది. మాసబ్ ట్యాంక్ లోని శాంతినగర్ లో మోర్ సూపర్ మార్కెట్ కి సమీపంలో ఈ కేఫ్ ఉంది. ఇరానీ చాయ్ తోపాటు బేకరీ స్టఫ్ కూడా లభిస్తుంది. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 11గంటల 30నిమిషాల వరకు తెరచి ఉంటుంది.

6. ఆల్ఫా

సికింద్రాబాద్ లోని ఆల్ఫా కెఫే చాలా ఫేమస్. ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇరానీ చాయ్ రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇంకా ఇరానీ చాయ్ లభించే కేఫ్ లు చాలా ఉన్నాయి. కానీ ది బెస్ట్ మాత్రం వీటిలో లభిస్తుంది అనడంలో సందేహం లేదు.