సాఫ్ట్ వేర్ ఉద్యోగి మిస్సింగ్.. ‘OLX’ పై అనుమానం

సాఫ్ట్ వేర్ ఉద్యోగి మిస్సింగ్.. ‘OLX’ పై అనుమానం

 ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మిస్సింగ్.. బెంగళూరు నగరంలో కలకలం రేపుతోంది. కారు ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన తర్వాత నుంచి అతను కనిపించకపోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. అజితాబ్(29) అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజుల క్రితం అజితాబ్ తన కారుని ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టాడు. ఓఎల్ఎక్స్  లో అతను పెట్టిన పోస్టుని ఇటీవల ఓ వ్యక్తి చూశాడు. చూసిన వెంటనే అజితాబ్ ని సంప్రదించాడు. తనకు కారు కొనడం ఆసక్తి ఉందని చెప్పాడు. అతని మాటలను నమ్మిన అజితాబ్.. సదరు వ్యక్తిని కలవడానికి ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6గంటల సమయంలో బయటకు వెళ్లాడు.

ఆరోజు బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదని అతని రూమ్మెట్స్ చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అజితాబ్ కి ఇటీవల కలకత్తాలోని ఐఐఎంలో ఎంబీఏ చదివేందుకు సీట్ లభించింది. దీంతో.. అక్కడ రూ.5లక్షలు చెల్లించాల్సి ఉంది. అందుకే కారు అమ్మకానికి పెట్టాడేమోనని అతని స్నేహితులు భావించినట్లు పోలీసులకు చెప్పారు. కాగా.. అతను కనపించకుండా పోయిన తర్వాత పోలీసులు అజితాబ్ ఫోన్ ని ట్రాక్ చేశారు. కాగా.. బెంగళూరు సిటీ అవుట్ కట్స్ లో చివరగా ఫోన్ కి సిగ్నల్స్ ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని పోలీసులు చెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ముఖ్యంగా ఓఎల్ఎక్స్ లో కారును కొనడానికి ఆసక్తి చూపింది ఎవరన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నామన్నారు. అజితాబ్ తోపాటు అతని కారు కూడా కనపడటం లేదని పోలీసులు తెలిపారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos