మునగకాయతో వాటికి చెక్ పెట్టేయచ్చు..!

First Published 27, Nov 2017, 12:33 PM IST
Benefits of Drumsticks From Improving Digestion to Boosting Immunity And More
Highlights
  • మన దక్షిణాది ప్రజల మనసుదోచిన కూరగాయల్లో ‘‘ మునగకాయ’’ కూడా ఒకటి.  
  • రుచికి రుచితో పాటు.. ఆరోగ్యాన్ని కూడా అందజేస్తుంది ఈ మునగకాయ. 
  • కేవలం కాయలే కాదు..చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే.

మన దేశంలో చాలా రకాల కూరగాయాలు పండుతుంటాయి.  వాటిల్లో మన దక్షిణాది ప్రజల మనసుదోచిన కూరగాయల్లో ‘‘ మునగకాయ’’ కూడా ఒకటి.  రుచికి రుచితో పాటు.. ఆరోగ్యాన్ని కూడా అందజేస్తుంది ఈ మునగకాయ.  కేవలం కాయలే కాదు..చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. మునగ కాయలే కాకుండా మునగ ఆకులను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. చాలా బలం కూడా. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగలో  ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.  మునగ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో.. ఇప్పుడు చూద్దాం..

మధుమేహం: మధుమేహ వ్యాధితో బాధపడేవారు కూడా దీని వలన ఎంతో ప్రయోజనం పొందుతారు. మధుమేహంతో బాధపడేవారికి ఎండబెట్టిన మునగ ఆకు పొడిని తేనెతో కలిపి సేవించండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుందంటున్నారు వైద్యులు.జలుబు మరియు ఫ్లూ నివారణకు: మునగలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీరు తరచూ జలుబు, జ్వరం వంటి వాటితో బాధపతుంటే, డ్రమ్ స్టిక్ సూప్(మునగకాయలతో) తయారు చేసిన సూప్ త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. మునగాకులో కూడా ఔషధగుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆస్త్మా, ముక్కు కారడం, శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

ఎముకల బలానికి: ఈ పచ్చని ముగకాయ, మునగాకులో అధికశాతంలో ఐరన్, విటమిన్స్, మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగానూ, బలంగానూ తయారౌతాయి.  అంతే కాదు రక్తాన్ని శుద్ది చేయడానికి బాగా సహాయపడుతుంది.రక్తాన్ని శుభ్రపరుస్తుంది: రక్తం శుభ్రతకు మునగాకు బాగా పనిచేస్తుంది. దీని రసాన్ని ప్రతి రోజూ లేదా వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా ఉంటుంది.కడుపు సంబంధించిన అనారోగ్యాలు: మునగాకులో మెండైన ఔషధగుణాలుండుట వల్ల తేనె, కొబ్బరినీళ్ళతో తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనాగోగ్యసమస్యలను దూరం చేస్తుంది. డయోరియా, డైసెంట్రీ, జాండీస్, కలర్ వంటి వాటికి మంచి విరుగుడు.

కీళ్ళ నొప్పులకు: మునగకాయ రసం, కీళ్లనొప్పుల నివారణకు ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు క్యాల్షియం అందుకు బాగా దోహదం చేస్తుంది. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

రోగనిరోధకశక్తి.. మునగకాయలను తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో రోగాలు త్వరగా రాకుండా ఉంటాయి.

loader