Asianet News TeluguAsianet News Telugu

క్రికెట‌ర్ల‌కు బీసిసిఐ షాక్‌

  • విరుద్ద ప్రయోజనాల నిబందన పై క్రికెటర్లకు  ఆదేశాలు.
  • ప్రభుత్వ ఉద్యోగాలు వదులుకోవాని పిలుపు
  • మొదట కొహ్లీ కి ఎసరు.
BCCI new rules for cricketers

లోధా క‌మీటి నిబంధ‌న‌ల ప్ర‌కారం బీసిసిఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే బోర్డు స‌భ్యుల‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు క‌ల్గి ఉండ‌కూడ‌ద‌ని చెప్పింది. దాదాపుగా ఆ నిబంధ‌న‌ అమ‌లు అవుతుంది. విరుద్ద ప్రయోజనాల విషయంలో బీసీసీఐ కూగా చర్యలు చేపట్టింది. ఇక క్రికెట‌ర్ల‌కు కూడా రెండు ఉద్యోగాల పై గురువారం కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

క్రికెట‌ర్లు దేశానికి ఆడుతూ మ‌రో వైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటే, త‌క్ష‌ణ‌మే త‌మ ఉద్యోగాలను వ‌దులుకోవాల‌ని తెలిపింది. అయితే అంద‌రి క‌న్న ముందుగా ఈ షాక్‌ కెప్టెన్‌ కోహ్లీకే తగలనుంది. ఆయ‌న కేంద్ర‌ చమురు సహజ వాయువుల సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇక ఆ జాబ్‌ను వదులు కోవాల్సిందే. చాలా మంది క్రికేట‌ర్లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌లో ప‌ని చేస్తున్నారు వారు ఇప్పుడు త‌మ ఉద్యోగాల‌ను వ‌దులుకోవాల్సి వ‌స్తుంది.


అయితే మొద‌టి నుండి విరుద్ద ప్ర‌యోజ‌నాల నిబంధ‌న‌ను చాలా మంది క్రికెట‌ర్లు వ్య‌తికిస్తున్నారు, క్రికెట‌ర్‌గా పరిమితి కాలం వ‌ర‌కు మాత్ర‌మే లైఫ్ ఉంటుంది త‌రువాత ప‌రిస్థితి ఏంటని క్రికెట‌ర్లు వాపోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios