సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు పడిపోతే ... బెంగ వద్దు, మార్గాలున్నాయి

Bank savings account interest rate fall What alternatives you have now
Highlights

  • రూ.కోటి లోపు డిపాజిట్లపై 50 బేస్ పాయింట్ల కోత విధిస్తూ 3.5 శాతం వార్షిక వడ్డీని అందించింది.
  • గతంలో 4శాతం ఉన్న వార్షిక వడ్డీని 3.5 శాతానికి కుదించింది.

 

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ఇటీవల పొదుపు ఖాతాలపై అందించే వడ్డీ రేటును తగ్గించింది. రూ.కోటి లోపు డిపాజిట్లపై 50 బేస్ పాయింట్ల కోత విధిస్తూ 3.5 శాతం వార్షిక వడ్డీని అందించింది. గతంలో 4శాతం ఉన్న వార్షిక వడ్డీని 3.5 శాతానికి కుదించింది. ఇదే నియమాన్ని చాలా కంపెనీలు ఇటీవల పాటించాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బ్యాంకులకు కొత్తేమీ కాదు. బ్యాంకుల్లో మనీ సేవ్ చేస్తున్నందుకు మనం కూడా వాటికి అలవాటు పడుతూ వస్తున్నాం. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా.. అంటే ఉంటాయి. అవేంటో చదవండి మీకే తెలుస్తుంది...

 

ఇప్పటికీ మనలో చాలా మంది డబ్బును బ్యాంకుల్లో దాచిపెడుతూ ఉంటారు. వేరే ఎందులో అయినా పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎక్కువ ఆసక్తి చూపించరు. దీనికీ ఓ కారణం ఉంది.. ఆర్థిక పరంగా అవగాహన లేకపోవడం.. లేదా డబ్బు బ్యాంకులో అయితే సురక్షితంగా ఉంటుదన్న భావన వారిలో ఉండి ఉండవచ్చు.

బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడం మంచిదే. అయితే.. ఆయా బ్యాంకింగ్ సంస్థలు వడ్డీ రేటును తగ్గించిన ప్రతిసారీ.. మనం ఎంతో కొంత నష్టపోతూనే ఉంటాం. ఇలాంటివి లేకుండా మన నగదును భద్రం చేసుకునే విధానాలు ఉన్నాయి.

 

పొదుపు ఖాతాల్లో.. ఎక్కవు మొత్తాన్ని పొదుపు చేయవద్దు.. :

ఏదైనా బ్యాంకింగ్ సంస్థ.. వార్షిక వడ్డీ రేటును 3.5శాతం మీద మీ పొదుపు ఖాతా కి ఇస్తామని ప్రకటిస్తే.. అలాంటి బ్యాంక్ లలో ఎక్కువ మొత్తాన్ని సేవింగ్ ఎకౌంట్స్ కింద జమ చేయకండి.

చాలా మంది రూ.కోటి కన్నా తక్కువ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు. రూ.కోటి కన్నా తక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకునే వారు.. వారికి తగిన ఆర్థిక ప్రణాళిక ప్రకారం పెట్టుబుడులు పెట్టాలి. మ్యూచివల్  ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు. అందులోనూ రిస్క్ తక్కువగా ఉన్నవాటిని ఆర్థిక పరిస్థితిని, అవసరాన్ని గుర్తుంచుకొని  ఇన్వెస్ట్ మెంట్ చేయాలి.

ఎక్కవు వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు ఎంచుకోవాలి.. :

లేదా...వడ్డీ రేట్లు ఎక్కవగా ఇచ్చే బ్యాంకులో డబ్బు జమ చేయాలి. చాలా వరకు రీజనల్ బ్యాంకులు, కొత్తగా లైసెన్స్ తీసుకున్న బ్యాంకులు వడ్డీ రేట్లు ఎక్కవగా ఆఫర్ చేస్తాయి. అలాంటి వాటిలో జమ చేయడం కూడా ఉత్తమమే.

 

నార్మల్ ఎకౌంట్స్ ని స్వీపింగ్ ఎకౌంట్స్ కి మార్చడం.. :

ఇలా కూడా కాదు అంటే.. మీ సేవింగ్ ఎకౌంట్స్ ని స్వీప్ ఎకౌంట్ కి మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవడం ద్వారా .. మీ బ్యాంకు ఖాతా ప్రకారం.. సేవింగ్ ఎకౌంట్స్ లోని మీ డబ్బంతా ఫిక్స్ డ్ డిపాజిట్ కి మారుతుంది. ఇలా మార్చుకోండం ద్వారా మీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు డబ్బును తిరిగి పొందగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో టీడీఎస్ డిడక్షన్స్ అప్లై అవుతాయి.

డెబ్ట్  ఫండ్స్ లో పెట్టబుడులు.. :

డెబ్ట్ ఫండ్స్ లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. దీనిలో వడ్డీరేట్లకు  డెబ్ట్ ఫండ్ గెయిన్స్ కి వ్యతిరేకంగా ఉంటుంది. డెబ్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే..వడ్డీ రేట్లు తగ్గించనప్పుడు నష్టం ఉండదు. ఒక వేళ ఎక్కవ కాలం పెట్టుబడులు పెట్టకూడదు అనుకుంటే.. లిక్విడ్ ఫండ్స్ ని ఎంచుకోవచ్చు. ఈ ఫండ్స్ లో ఎక్కవ మెచ్చురీటీ కాలం 91 రోజులు. చాలా మంది ఫండ్ ఆపరేటర్స్ సేవింగ్ ఎకౌంట్ ను లిక్విడ్ ఎకౌంట్ కి అనుసంధానం మొబైల్ యాప్ ద్వారా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

మీ సేవింగ్ ఎకౌంట్స్ లో మినిమమ్ డబ్బును ఉంచుకొని పైన చెప్పిన విధానాల్లో జమ చేసుకుంటే.. వడ్డీరేటు తగ్గినా పెద్దగా వచ్చే నష్టం ఉండదు.

 

Adhil shetty, bank bazaar.com, ceo

loader