యాభై, నూరు నోట్ల ఉపసంహరణ పుకార్లమీద వివరణ

రూ.100, రు. 50 నోట్ల రద్దుపై క్లారిటీ వచ్చింది..! గత రెండు రోజులు సోషల్ మీడియా ఈ రెండు రకాలనోట్లను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అర్థరాత్రి నుంచి ఉపసంహరించుకుంటున్నదనే వార్త ఠారెత్తిస్తున్నది. ఈ తుంటరి పనికి జీన్యూస్ ప్లస్ అనే లోగో కూడా తగిలించి నమ్మించిప్రయత్నం చేశారు.ఇలాంటి కీలకమయిన నిర్ణయం మీద కేంద్ర ప్రభుత్వం గాని, రిజర్వు బ్యాంకు గాని ప్రకటన చేయాలని గాని కేవలం న్యూస్ లోగోతో ప్రచారం చేయడం సాధ్యమా.... అనేది అలోచించకుండా చదువుకున్నవాళ్లంతా ఈ ఫేక్ న్యూస్ ను తెగ షేర్ చేసి గొప్పసామాజిక బాధ్యత నెరవేర్చిట్లు ఉప్పొంగిపోయారు. అయితే, వరంగల్ బ్యాంకు అధికారులు దీనిమీద స్థానికంగ నైనా వివరణ ఇచ్చారు. రూ.100, 50 కరెన్సీ నోట్లు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు రద్దు అవుతాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ వరంగల్‌ ప్రధాన శాఖ ముఖ్య మేనేజర్‌ నందం మురళి చెప్పారు. సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ నుంచి తమకు ఏలాంటి సమాచారంలేదన్నారు. పది రూపాయల నాణాలు చెల్లవంటూ ఇటీవల జరిగిన ప్రచారం తరహాలోనే ఈ ప్రచారం కావొచ్చని, ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మరాదని సూచించారు.