ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా  హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. దసరా ఉత్సవాల ఆఖరి రోజున కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి అమ్మవారి గా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు అమ్మవారు భోగభాగ్యాలను  ఆయరారోగ్యాన్ని ప్రసాదించాలని అమ్మవారి వేడుకున్నానని చెప్పారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రమయిన అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెంది ప్రపంచ పటంలో ఉన్నతమైన స్దానంలో ఉండేలా  అమ్మవారు దీవించాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.