హిందూపురం నుంచి పారిపోలేదు...పారిపోను

balayya says he has not  abandoned hindupuram
Highlights

హిందూపురం నియోజకవర్గం వదలిపోలేదు, పోయేది లేదు.
వచ్చే ఎన్నికల్లో  కృష్ణా జిల్లా గుడివాడ, మైలవరం స్థానాల నుంచి తాను పోటీ చేస్తాననే ప్రచారం నిజం కాదు. మళ్లీ ఇక్కడి నుంచే పోటీ

హిందూపూరం నుంచి పారిపోలేదని, పారిపోయేది కూడా ఉండదని తెలుగు హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు.

 

2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని, అది కూడా హిందూపురం నుంచే అని ఆయన చెప్పారు.

 

ఈ మధ్య ఆయన హిందూపురాన్ని పట్టించుకొనకపోవడం, ఎనిమిదిగా నియోజకవర్గం ముఖం చూపించకపోవడం, పెత్తనం మొత్తం పిఎకి అప్పగించడం...  స్థానిక పార్టీలో ఈ పెత్తనానికి వ్యతిరేకంగా అసమ్మతి చెలరేగడంతో... బాలయ్య హిందూపురం నుంచి పారిపోయి, ఎక్కడో ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తాడని వార్తలొచ్చాయి. అంతేకాదు, రాయలసీమ మీద చిన్నబాబు గ్రిప్పురావడానికి వచ్చే ఎన్నికలలో మామ స్థానంలో అల్లుడుపోటీచేస్తాడని కూడా పార్టీ వర్గాలలో చర్చ వినిపించింది.

 

ఈ నేపథ్యంలో బాలయ్య అదివారం నాడు హిందూపురం నియోజకవర్గం వదలిపోలేదని, పోయేది లేదని అన్నారు.
‘వచ్చే ఎన్నికల్లో నేను కృష్ణా జిల్లా గుడివాడ, మైలవరం స్థానాల నుంచి తాను పోటీ చేస్తాననే ప్రచారం నిజం కాదు,’ అన్నారు.2019లోనూ హిందూపురం నుంచే పోటీ చేస్తాను, అని స్పష్టం చేశారు.

హిందూపురం టిడిపి నేతల్లో ఎలాంటి విభేదాలు లేవు.  ఒకవేళ ఉన్నా వాటికి భయపడటం నా రక్తంలోనే లేదు అని చెప్పారు.
త్వరలోనే హంద్రీనీవా నీటితో కృష్ణదేవరాయల కాలం నాటి చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు. అలాగే రూ. 194 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి ప్రత్యేక పైప్ లైన్ వేసే ప్రక్రియకు త్వరలోనే టెండర్లు పిలిచి ఐదునెలల్లో పనులు పూర్తి చేస్తామని కూడా బాలయ్య చెప్పారు.

 

హిందూపురం పట్టణంలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ సిస్టం ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ నెలకొల్పాలని డీజీపీని కోరినట్లు ఆయన వెల్లడించారు.ఈ శ్రావణ మాసంలో రూ.23 కోట్లతో నిర్మించనున్న కూరగాయల మార్కెట్‌కు భూమిపూజ చేయడంతో పాటు ఆర్టీఓ కార్యాలయం, పశువు ఆసుపత్రి భవనాలు కూడా ప్రారంభిస్తామని బాలయ్య చెప్పారు.

 

loader