పేద విద్యార్థులకు బాలకృష్ణ స్కాలర్‌షిప్స్‌

balayya plans to give away 101 scholarships for poor to celebrate paisa vasool
Highlights

101వ సినిమాపూర్తి చేసిన సందర్భంగా 101 మంది పేద విద్యార్థులకు బాలయ్య స్కాలర్ షిప్ లు ఇవ్వాలనుకుంటున్నారు. పైసా వసూల్  ఆయన 101 వ చిత్రం.వివరాలివిగో...

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పైసా వసూల్‌’. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా హీరోగా బాలకృష్ణకు 101వది. ఈ సందర్భంగా భవ్య క్రియేషన్స్‌ ‘పైసా వసూల్‌’ సినిమా విడుదలప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని బాలకృష్ణ అభిమానులు, అభిమానుల కుటుంబ సభ్యుల్లోని పదో తరగతి, ఇంటర్‌ చదువుతున్న 101మంది పేద విద్యార్థినీ, విద్యార్థులకు తమ హీరో నందమూరి బాలకష్ణగారి పేరు మీద స్కాలర్‌షిప్స్ ఇవ్వాలని నిర్ణయించింది. బాలకృష్ణ అభిమానులు, అభిమానుల కుటుంబ సభ్యులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందేందుకు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులకు ఇవ్వవలసి ఉంటుంది. అయితే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఇన్‌కమ్‌ సర్టిఫికేట్, వైట్‌ రేషన్‌ కార్డ్, స్కూల్‌ లేదా కాలేజ్‌ స్టడీ సర్టిఫికేట్‌ మరియు మార్క్స్ మెమోలను సదరు దరఖాస్తుకు జత చేయవలసి ఉంటుంది. దరఖాస్తులను అందజేయడానికి ఆగస్టు 10 ఆఖరు తేదీ. ఈ కింది జాబితాలోని బాలకృష్ణ అబిమాన సంఘాల అధ్యక్షులను ఆయా జిల్లాలకు చెందిన దరఖాస్తుదారులు ఫోనులో సంప్రదించి, తమ దరఖాస్తులను వారికి అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు "nbkpaisavasool.com" website క్లిక్ చేయగలరు. ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. అయితే... అభిమాన సంఘాల అధ్యక్షులు పంపించిన జాబితా నుంచి తుది జాబితను భవ్య క్రియేషన్స్‌ వారు ఎంపిక చేస్తారు.

బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులు
తెలంగాణ: (పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం)
1.హైదరాబాద్‌– శర్మ – 9848129904
2. రంగారెడ్డి– రాజు – 9396699955
3. ఆదిలాబాద్‌– ఖాజా మియా –9866312888
4. మహబూబ్‌నగర్‌– ఆర్‌. బాలప్ప – 9346389045
5. ఖమ్మం– టి. శ్రీనివాస్‌ –9059393778
6. నల్గొండ– బి.శ్రీనివాస్‌ –9848259288
7. నిజమాబాద్‌– మల్లిఖార్జున్‌–9848652281– 9010016405
8. కరీంనగర్‌– ఎస్‌. రాజేష్‌– 9849539015,9182117962.
9. వరంగల్‌– సాగంటి ప్రకాశ్‌– 9963641335
10. మెదక్‌– పరమేశ్వర్‌–9010937001

నవ్యాంధ్రప్రదేశ్‌:
1. నెల్లూరు– సుధాకర్ –9347101378
2. ప్రకాశం– వాసు– 7893445333
3. గుంటూరు– హనుమంత్‌రావు–9949474555
4. కృష్ణ– నిమ్మగడ్డ ప్రసాద్‌ –9573295555
5. పశ్చిమగోదావరి –శ్రీను– 9849828755
6. తూర్పుగోదావరి –ప్రసాద్‌– 9849893951
7. వైజాగ్‌– పైడి రాజు– 9393110651
8. విజయనగరం– భాస్కర్‌ –8886098895
9. శ్రీకాకుళం– వెంకటేష్‌–9390612106
10.కడప - పేరయ్య - 9440990479
11. చిత్తూరు - నరసింహ నాయుడు - 9440872700
12. అనంతపురం - గౌస్ - 9440780188
13. కర్నూల్ - సుధాకర్ నాయుడు - 9440768962

loader