ప్రియురాలిని కత్తితో నరికి...తాను పురుగుల మందు తాగి

First Published 31, Dec 2017, 5:49 PM IST
badradri kothagudem murder
Highlights
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
  • యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
  • ఆ తర్వాత పురుగుల మందు తాగిన యువకుడు
  •  
  •  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.    ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలి కుంటలో  చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరుకు చెందిన ఊటుకూరి శ్రీను ఖమ్మం జిల్లాలోని వేంసూరులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తన్నాడు. ఊటుకూరి శ్రీను కుమార్తె మీనా ప్రవల్లిక(22) నెమలిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా పనిచేస్తున్నది.  అయితే వీరి కుటుంబానికి బంధువైన వనమా శ్రీను(25)కు తన కుమార్తె మీనా ప్రవల్లికను ఇచ్చి పెండ్లి చేయాలనుకున్నాడు. అయితే వనమా శ్రీను పనీపాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో అతడిని కాదని వేరే సంభందాలు చూస్తున్నారు. దీంతో ఆ కుటుంబంపై వనమా శ్రీను కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో గత కొంత కాలంగా  శ్రీను తననే పెళ్లి చేసుకోవాలని మీనా వేధించడం ప్రారంభించాడు. అలాగే నిన్న కూడా ఆమె పనిచేసే పాఠశాలకు వచ్చి తనను పెండ్లి చేసుకోవాలని అడిగాడు. దీంతో ఆమె తమ కుటుంబసభ్యులతో మాట్లాడాలని చెప్పింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. దీంతో ముందే పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రవల్లికపై దాడి చేశాడు. ఈ తర్వాత వెంటనే క్రిమి సంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

తీవ్ర గాయాల పాలైన ప్రవల్లికను స్థానికులు  ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా  మార్గ మద్యలో మృతిచెందింది. ఆమె  కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వనమా శ్రీను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

loader