Asianet News TeluguAsianet News Telugu

భాజపా అగ్రనేతలు కుట్రదారులే

ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం నాటి కేసు ఇంకా భాజపాను నీడలాగ వెన్నాడుతూనే ఉంది. తాజాగా సుప్రింకోర్టు తీర్పు భాజపాకు పెద్ద దెబ్బే. మస్జీద్ కూల్చివేత ముమ్మాటికీ కుట్రగానే సుప్రింకోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం.

Babri ghost still haunting BJP old guard  advani

ఒక సినిమాలో ‘ఒదల బొమ్మాళీ నిన్నొదల’ అన్న పాపులర్ డైలాగ్ ఒకటుంది. ఆ డైలాగ్ ఇపుడు భాజపాకు సరిగ్గా సరిపోతుంది. బాబ్రీ మస్జీద్ కూల్చివేత కేసు భారతీయ జనతా పార్టీ వెంటపడుతూనే ఉంది. ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం నాటి కేసు ఇంకా భాజపాను నీడలాగ వెన్నాడుతూనే ఉంది. తాజాగా సుప్రింకోర్టు తీర్పు భాజపాకు పెద్ద దెబ్బే. మస్జీద్ కూల్చివేత ముమ్మాటికీ కుట్రగానే సుప్రింకోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం. 25 ఏళ్ళ క్రితంనాటి కేసు ఇంకా పెండింగ్ లో ఉండటమంటే న్యాయాన్ని హరించటంగానే చూడాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవే. అందులోనూ భాజపా అగ్రనేతల్లో పలువురిపై కుట్రకేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని నిర్ణయించటం కూడా పార్టీకి పెద్ద దెబ్బే.

ఇకపై కేసులో జాప్యం జరగకుండా రోజు వారీ విచారణ చేపట్టాలని కూడా సుప్రింకోర్టు నిర్ణయించటం గమనార్హం. అగ్రనేతలైన ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా పలువుపై కుట్రకేసు నమోదైంది. కేసుతో సంబంధముందన్న పలువురు మరణించగా మరికొందరు జీవిత చరమాంకంలో ఉన్నారన్న కారణంగానే కేసును రోజువారి విచారణకు చేపట్టాలని ఆదేశించటం విశేషం. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రేసులో ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషికి సుప్రింకోర్టు నిర్ణయం పెద్ద దెబ్బే.

కాగా కుట్రకేసులో మరో ప్రముఖ నేత అయిన ఉమాభారతి విషయంలో ప్రధాని ఏం చేస్తారన్నది ఇపుడు ఆశక్తిగా మారింది. ఎందుకంటే, ఉమాభారతి కేంద్రమంత్రి. మరి సుప్రింకోర్టు స్వయంగా ఉమాభారతిని కుట్రదారుగా పేర్కొన్న తర్వాత కూడా మంత్రివర్గంలో ప్రధాని ఉమాభారతిని ఏ విధంగా కొనసాగిస్తారు? ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి వర్గం చాలా నిశితంగా పరిశీలిస్తున్నది. ఎందుకంటే, పార్టీలో ఇప్పటికీ అద్వానీ మద్దతుదారులు చాలామంది ఉన్నారు. అద్వానీ అంటే మోడికి ఏమాత్రం గిట్టటం లేదు. అటువంటిది ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగ ఇటు అద్వానీకి పదవీ యోగం దాదాపు పోయినట్లే. అదేవిధంగా అద్వానీ వర్గం ఇకపై పెద్దగా నోరెత్తేందుకు లేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios