పతంజలి గోధుమ పిండిలో కల్తీ.. పిండికాదు.. అది రబ్బర్?

Baba Ramdev's Patanjali: Facebook, Google, Youtube to remove video against company's product
Highlights

పిండి కాదు అది రబ్బర్ అన్న తమిళ బ్లాగు

నూడిల్స్ తయారీతో పతంజలి తొలిసారిగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు పతంజలి అందించని వస్తువు అంటూ ఏదీ లేకుండా పోయింది. ఉప్పులు, పప్పులు, సబ్బులు, పేస్టులు సహా.. సౌందర్య ఉత్పత్తులను కూడా అందిస్తోంది. దేశీయ, సహజంగా తయారు చేసిన వస్తువుల  పేరిట ప్రచారం మొదలుపెట్టి.. మార్కెట్ లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అతి తక్కువ  కాలంలో గుర్తింపు సాధించింది. ఎప్పుడైతే జనాలు పతంజలి ఉత్పత్తులు కొనడం ప్రారంభించారో.. వీటిపై దుష్ప్రచారం మొదలైంది.

కాగా.. ఈ దుష్ప్రచారాల పట్ల పతంజలి సీరియస్ అయ్యింది. తాజాగా పతంజలి సంస్థ తయారు చేసిన గోధుమ పిండిని రబ్బర్‌గా పేర్కొన్నందుకు ఓ తమిళ బ్లాగ్ మీద ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దానికి స్పందించిన హైకోర్టు ఆ బ్లాగుని తొలగించమని ఫేస్ బుక్, యూట్యూబ్, గూగుల్ సంస్థలను ఆదేశించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఉన్న ఫళంగా ఆ బ్లాగుకి సంబంధించిన సమాచారాన్ని, లింకులను యాక్సెస్ చేయడానికి వీల్లేకుండా అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆ బ్లాగు నిర్వహిస్తున్న వ్యక్తి వివరాలు బహిర్గత పరచాలని కూడా హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది.

loader