యోగా గురు బాబా రాం దేవ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్న అనుబంధం గురించి కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు.

 

బహిరంగంగానే మోదీకి ఆయన చాలా సార్లు మద్దతు ప్రకటించారు. ఆయన విధానాలను కూడా తెగ పొగుడుతుంటారు.

 

అందుకే మోదీ కూడా బాబా పిలిచినప్పుడల్లా ఆయన ఏర్పాటు చేసే కార్యక్రమాలకు వెళుతుంటారు.

 

తాజాగా బాబా రాందేవ్ తన పేరు మీద హరిద్వార్ లో రాం దేవ్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ ను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి పీఎం మోదీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.

 

మోదీ రాక సందర్భంగా బాబా రాందేవ్ భక్తసేన పేపర్లో ఓ ప్రకటన ఇచ్చింది. అదే ఇప్పుడు నెటిజన్లనో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

రాందేవ్ బాబా కు చెందిన పతంజలి ఉత్పత్తుల సంస్థతో ఇచ్చిన యాడ్ లో ప్రధాని మోదీని రాష్ట్ర రుషి పేరుతో ఆకాశానికి ఎత్తారు. అంటే మోదీ దేశానికే రుషి లాంటివాడని వారు చెప్పదల్చుకున్నారన్నమాట.

 

దీనిపైనే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

 

మోదీ దేశానికి ప్రధాని అని మాత్రమే తెలుసు కానీ, ఆయన దేశానికి రుషి ఎప్పుడయ్యారు అని ఓ ట్విటరిస్టు అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు. మరొకరు బాబా రాందేవ్ మరీ ఎక్కువ చేసేస్తున్నారంటూ పోస్టు చేశాడు.

 

ఇలా మోదీకి బాబా రాందేవ్ తగిలించిన కొత్త బిరుదు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతోంది.