తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన సినిమా ‘‘బాహుబలి’’. దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా కలెక్షన్లకి బాక్సాఫీసు బద్దలైంది. రాజమౌళి నాలుగేళ్ల పాటు కష్టపడి తీసిన ఈ ‘‘బాహుబలి’’ సినిమా.. ఇప్పుడు విద్యార్థులకు పాఠంగా మారనుంది. మీరు చదవింది నిజమే.. బాహుబలి సక్సెస్ సీక్రెట్ ని విద్యార్థులకు వివరించాలని  అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్లు భావిస్తున్నారు.

బాహుబలి( ది బిగినింగ్), బాహుబలి2 పేరిట  రెండు విభాగాలుగా ఈ సినిమా తీయగా.. రెండూ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాయి. సీక్వెల్స్‌ తీస్తున్నప్పుడు ఫస్ట్‌ పార్ట్‌ సక్సెస్‌ అయితే... రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. మార్కెటింగ్‌ సులువు అవుతుంది. బాహుబలి విషయంలోనూ ఇదే జరిగింది. రాజమౌళి మార్కెటింగ్‌ స్ట్రాటజీ... కలెక్షన్ల విషయంలో బాహుబలిని లెజెండరీ మూవీగా నిలబెట్టింది. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్నాయి కాబట్టే... అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రొఫెసర్లు బాహుబలిని సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు.

 

బాహుబలి సీక్వెల్స్‌ నిర్మాణం, మార్కెటింగ్‌ మంత్ర, కలెక్షన్స్‌ మీద దృష్టి పెడుతున్నట్లు ఐఐఎం ప్రొఫెసర్లు చెప్పారు. ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు డిజిటల్‌ మార్కెట్‌ గురించి వివరిస్తామన్నారు. బాహుబలిని ఎగ్జాంపుల్‌గా తీసుకుని... సినీ ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల్లో స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్తామంటున్నారు. వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌సక్సెస్‌ సాధించిన బాహుబలే సినిమానే సరైన సబ్జెక్ట్‌ అనిపించిందని.. అందుకే ఈ మూవీని ఎంపిక చేశామంటున్నారు ఐఐఎం ప్రొఫెసర్లు. ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.