ఉదయమంతా పూజలో మునిగిపోయిన శ్రీరాములు

ఉదయమంతా పూజలో మునిగిపోయిన శ్రీరాములు

బెంగళూరు: బాదామి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి బి. శ్రీరాములు మంగళవారం ఉదయం పెద్ద యెత్తున పూజలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజును ఆయన పూజలతో పూజలతో ప్రారంభించారు. 

కాషాయ వస్త్రాలు ధరించి మంగళవరం ఉదయమే పూజ గదిలో కూర్చుని దైవానికి పూలు, ఫలాలు సమర్పిస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ లో బాదామి బయలుదేరి వెళ్లారు. 

సిద్ధరామయ్య మాదిరిగానే శ్రీరాములు కూడా రెండో నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. బాదామిలో వెనకబడిన శ్రీరాములు మొలల్మూరులో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

శనివారం పోలింగ్ రోజు ఆయన గోపూజ చేశారు. గోపూజ చేసి ఆయన ఓటు వేయడానికి బయలుదేరారు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి బి. శ్రీరాములు అత్యంత సన్నిహితుడు. బిజెపి అభ్యర్థుల్లో ఆయన కీలకమైన నేత.

యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన పోటీ పడే అవకాశం ఉంది. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos