అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన వారిలో విద్య, వైద్య, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం, వ్యవసాయం, సమాజసేవ తదితర రంగాలకు చెందిన వారు ఉన్నారు. వీరికి మార్చి8వ తేదీ( మహిళా దినోత్సవం) న అవార్డుతోపాటు రూ.1లక్ష నగదు బహుమతి కూడా అందించనున్నారు.

విద్యారంగం - కవిత దరియాణి
క్రీడలు - అరుణా రెడ్డి
వైద్యం - సత్యలక్ష్మి
పాత్రికేయం - సౌమ్య నాగపురి(నమస్తే తెలంగాణ), లతా జైన్
సాహిత్యం - చక్రవర్తుల లక్ష్మీనరసింహ, సిరి
నాట్యం - మంజులా శ్రీనివాస్
సంగీతం - నిత్య సంతోషిణి
చిత్రకళలు - కవితా దేవుష్కర్
సినీరంగం - నందినీ రెడ్డి
జానపద సాహిత్యం - ఝాన్సీ
ఉద్యమగానం - ఎడునూరి పద్మ
మహిళా వ్యాపారవేత్త - రాజ్యలక్ష్మి
వృత్తి సేవలు - హైదరాబాద్ మెట్రో రైలు మొదటి మహిళా డ్రైవర్ సుప్రియ, ఢిల్లీ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ సరిత
మహిళా సాధికారత - యాప భద్రమ్మ
వ్యవసాయం - బొగ్గం జయమ్మ
ప్రజాప్రతినిధుల విభాగం - కొత్తపల్లి గ్రామసర్పంచ్ శైలజ
సామాజిక సేవ - గండ్ర రమాదేవి