వేసవి వచ్చింది అంటే చాలు చాలా మంది ఖర్బుజా పండు జ్యూస్ తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. శరీరంలోని వేడి తగ్గించడంతోపాటు.. ఎండ వేడిని తట్టుకునేందుకు ఖర్బుజా పనిచేస్తుందని నమ్మకం. అంతేకాదు వేసవి దప్పికను కూడా త్వరగా తీరుస్తుంది. అయితే.. ఇదే ఖర్బుజా తిని.. ఆస్ట్రేలియాలో నలుగురు మృతి చెందారు.

మీరు చదివింది నిజమే. కేవలం ఖర్బుజా పండు తినడం వల్లే వాళ్లు మృతి చెందారు. ఆ ఖర్బుజా పండ్లలో లిస్టీరియా అనే వైరస్ ఉండటం వల్లే వారు చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. మరో 15మంది ఈ పండు తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు విక్టోరియా, మరో ఇద్దరు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు.

నలుగురు మృతితో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పిల్లలు, వృద్ధులు, గర్బిణీలు ఈ ఖర్బుజా పండు తినవద్దని సూచిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన ఖర్బుజా పండ్లను అందరూ తిప్పి వెనక్కి పంపిస్తున్నారు.

ఇంతకీ ఏమిటీ లిస్టీరియా..?

లిస్టీరియా అనేది ఒక వైరస్. ఒకరకమైన అంటువ్యాధి కూడా. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఇది తయారౌతుంది. దీని కారణంగా మనిషి జబ్బునపడే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, ముసలివాళ్లకు త్వరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పాశ్చరైజేషన్ చేయని పాలు, డెయిరీ పదార్ధాలలో కూడా ఇది సంక్రమిస్తుంది. ఈ వైరస్ సోకిన ఆహారాన్ని తిన్నవారికి జ్వరం, వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.