ఔరంగాబాదులో ఘర్షణలు: ఇద్దరు మృతి, 100 షాపులు దగ్ధం

ఔరంగాబాదులో ఘర్షణలు: ఇద్దరు మృతి, 100 షాపులు దగ్ధం

ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాదులో ఇరు వర్గాల మధ్య శనివారం ఘర్షణ తలెత్తింది. దీంతో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఇద్దరు మరణించారు. వందకు పైగా దుకాణాలు, పలు వాహనాలకు అల్లరి మూకలు నిప్పు పెట్టాయి.  

అల్లరి మూకలు వీధుల్లో సంచరిస్తూ విధ్వంసానికి దిగాయి. పోలీసు కాల్పుల్లో నగరానికి చెందిన అబ్దుల్ ఖాద్రీ అనే వ్యక్తి మరణించాడు. దుకాణానికి అల్లరి మూకలు నిప్పు పెట్టడంతో దుకాణంలో ఉన్న జగన్ లాల్ బన్సీల్ అనే వ్యక్తి మరణించాడు. 

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు 144వ సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సర్వీసులను ఆపేశారు. శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య నీటిపై గొడవ జరిగింది. అది హింసకు దారి తీసింది. 

ఇరు వర్గాలకు చెందిన అల్లరి మూకలు కూడా వీధుల్లో సంచరిస్తూ విధ్వంసానికి దిగాయి. శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు హోటల్లో ఇద్దరు వ్యక్తులు కొట్లాటకు దిగారు. ఆ తర్వాత వారు తమ తమ మద్దతుదారులను పిలుచుకన్నారని, పెద్ద గుంపు ఏర్పడిందని, రెండు సామాజికవర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగానే పుకార్లు వ్యాపించాని పోలీసు కమిషనర్ చెప్పారు. 

సకాలంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ వారిని నియంత్రించలేకపోయారు. ఆ తర్వాత ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఘర్షణకు అసలు కారణమేమిటనేది ఇంకా స్ప,్టం కాలేదని పోలీసు కమిషనర్ చెప్పారు. 
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos