ఆడి కార్లపై భారీ డిస్కౌంట్లు

First Published 2, Dec 2017, 4:59 PM IST
Audi offers discounts of up to rs 8lakh
Highlights
  • ఆడి.. భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
  • న్యూఇయర్, క్రిస్మస్ ఫెస్టివల్స్ పురస్కరించుకొని ఈ ఆఫర్ ప్రకటించింది.
  • సెలక్టెడ్ మోడల్ కార్లపై దాదాపు రూ.3లక్షల నుంచి రూ.8.85లక్షల వరకు తగ్గింపు 

జర్మనీ లక్సరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. న్యూఇయర్, క్రిస్మస్ ఫెస్టివల్స్ పురస్కరించుకొని ఈ ఆఫర్ ప్రకటించింది. సెలక్టెడ్ మోడల్ కార్లపై దాదాపు రూ.3లక్షల నుంచి రూ.8.85లక్షల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు ఆడి కంపెనీ పేర్కొంది. లిమిటెడ్ ఆఫర్‌గా ప్రకటించిన ఈ "ప్రత్యేక ధరల"తో పాటు  సులభమైన ఈఎంఐ ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది.దీంతోపాటు మరో బంపర్‌ ఆఫర్‌కూడా ఉంది.  2017లో    ఫేవరేట్‌ ఆడి కారును  కొనుగోలు చేసిన కస్టమర్లు.. 2019లో చెల్లింపులు మొదలుపెట్టవచ్చని ఇది తమ  కస్టమర్లకు  అందిస్తున్న అదనపు ప్రయోజనమని  కంపెనీ వెల్లడించింది.

అమ్మకాల డ్రైవ్లో భాగంగా ఎంపిక చేసుకున్న మోడళ్లపై  ఈ తగ్గింపును అందిస్తున్నట్టు ఆడి శుక్రవారం వెల్లడించింది.  క్రిస్మస్‌, కొత్త ఏడాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  ఆడి ఏ3, ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ3 మోడళ్లపై ఈ ప్రత్యేక ధరలు, సులభ ఈఎంఐ ని అందిస్తున్న‍ట్టు  ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

ఆఫర్‌లో భాగంగా ఆడి ఏ3 ధర రూ.31.99 లక్షల నుంచి రూ.26.99 లక్షలకు తగ్గింది. ఇక ఆడి ఏ4 పాత ధర రూ.39.97 లక్షలు కాగా.. ప్రస్తుతం రూ.33.99 లక్షలకే లభించనుంది. ఇక ఆడి ఏ6 సెడాన్‌ ధర రూ.53.84 లక్షల నుంచి రూ.44.99 లక్షలకు, ఎస్‌యూవీ ఆడి క్యూ3 ధర రూ.33.4 లక్షల నుంచి రూ.29.99 లక్షలకు తగ్గాయి.

loader