స్కూల్ టీచర్ పై కత్తితో దాడిచేసిన యువకుడు

First Published 30, Jan 2018, 11:45 AM IST
Attack with a knife on a lady at badradri kothagudem district
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

ఓ టీచర్ పై కత్తితో దాడిచేసిన యువకుడు

ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. దమ్మపేట లో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఓ యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  దమ్మపేట శివారులోని నెమలిపేట ప్రాథమిక పాఠశాలలో ప్రవళిక అనే యువతి విద్యావాలంటీర్ గా పని చేస్తోంది.  రోజూ మాదిరిగానే ఈమె స్కల్ కి వెళ్లగా, అప్పటికే ఆమెకోసం కాపుకాచుకుని వున్న వనమా శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడు కూడా పురుగుల మందుతాగి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు.  

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘాతుకానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

loader