టోల్ ఫీజు అడిగినందుకు మహిళా ఉద్యోగిని ఎలా కొట్టాడంటే

Attack on a female employee for asking toll fees
Highlights

  • టోల్ ప్లాజా మహిళా ఉద్యోగిపై దాడి
  • గుర్గావ్ ఎక్స్ ప్రెస్ హైవే టోల్ ప్లాజా వద్ద ఘటన

టోల్ ఫీజు అడిగినందుకు ఓ మహిళా ఉద్యోగిని పై దాడికిదిగాడు ఓ దుండగుడు. ఈ ఘటన గుర్గావ్ ఎక్స్ ప్రెస్ హైవే పై జరిగింది.  
 
వివరాల్లోకి వెళితే  గుర్గావ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పై గల ఖేర్కి దులా టోల్‌ ప్లాజా వద్దకు ఓ కారు వచ్చింది. దీంతో టోల్‌ ప్లాజాలో టోల్ వసూలు చేస్తున్న మహిళా ఉద్యోగిన టోల్‌  ఫీజును చెల్లించాలని కారులోని వ్యక్తిని సూచించింది. దీంతో నన్నే టోల్ ఫీజు అడుగుతావా అంటూ సదరు వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. నేను ఇక్కడ చాలా పలుకుబడి వున్న వ్యక్తిని నన్నే టోల్ ఫీజు అడుగుతావా అంటూ దాడికి దిగాడు. అంతే కాకుండా మహిళను దూషిస్తూ తాను ఇక్కడ లోకల్ నన్నేవరూ ఏం చేయలేరు, నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ హెచ్చరించాడు. అంతేకాక రాయడానికి వీలు లేని విధంగా టోల్‌ ప్లాజా ఉద్యోగులందరిపై తిట్ల వర్షం కురిపించాడు.

దీంతో అక్కడ పనిచేసే టోల్‌ ఉద్యోగులం‍తా అతడిని పట్టుకోడానికి ప్రయత్నించగా పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది కారుకు బారీకేడ్లు అడ్డుపెట్టి పట్టుకున్నారు.

ఈ దాడిఘటననపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  టోల్‌ ఫీజు అడిగినం‍దుకు నన్ను కొట్టడంతో పాటు.. చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

 

 

loader