ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ అసుస్.. భారత మార్కెట్లోకి తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న ‘ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’ ప్రదర్శనలో ‘‘జెన్ ఫోన్ 5 జెడ్’’ పేరిట ఈ ఫోన్ ని విడుదల చేసింది. త్వరలోనే వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ.38,179గా ప్రకటించారు. బ్లూ, సిల్వర్ రంగుల్లో లభించనున్నాయి. చాలా తక్కువ సమయంలో ఫోన్ ఛార్జింగ్ అవ్వడం ఈ ఫోన్ ప్రత్యేకత.

అసుస్ జెన్ ఫోన్ 5జడ్ ఫీచర్లు...

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 2 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.