Asianet News TeluguAsianet News Telugu

ఎంపి కవిత లక్ష్యం కొద్ది గా నెరవేరింది

  • జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటుపై టిఆర్ ఎస్ ఎంపి  కవిత క్యాంపెయిన్
  • ప్రధాని మీద వత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి
  • స్పందించి  ప్రధానికి ఉత్తరం రాసిని అస్సాం ముఖ్యమంత్రి

 

Assom CM writes to pm on turmeric board


 
జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు  కోసం ప్రయత్నిస్తున్న   నిజామాబాద్  ఎంపి కల్వకుంట్ల  కవిత ప్రయత్నానికి అసోం సిఎం సర్బానంద సోనోవాల్ తన మద్దతు తెలిపారు. పసుపు రైతులను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని సోనోవాల్ ఈ నెల 7వ తేదీన  ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కాఫీ, రబ్బర్, టీ, కాయిర్లకు ప్రత్యేకంగా బోర్డులు ఉన్నట్లే పసుపుకు సయితం బోర్డ్ ను  ఏర్పాటు చేయాలని కోరారు. అసోం లో 2015-16 లో 1,41, 441 టన్నుల అల్లం పంట దిగుబడి బాగా ఉందని, 16.184 టన్నుల పసుపు పండిందని  తెలిపారు. ఈ నేపథ్యంలో పసుపు తో పాటు అల్లం కు కూడా బోర్డు ఏర్పాటు చేయాలని సోనోవాల్ ప్రధాని కి రాసిన లేఖలో పేర్కొన్నారు.  

పసుపు రైతు లను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏ ర్పాటు చేస్తూ, కనీస మద్ధతు ధరను ప్రకటించాలని ఎంపి కవిత ఇప్పటికే కేరళ మాజీ సిఎం ఊసెండి, ప్రస్తుత సీఎం విజయన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లను కలిసి మద్దతు కోరిన విషయం తెలిసిందే. యి ప్పటికే రెండు సార్లు ప్రధాని మోడీ ని ,కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిశారు.   ఈ నెల 1వ తేదీన అసోం సిఎం సోనోవాల్ ను కలసి మద్దతు కోరారు. స్పందించిన సోనోవాల్ ఈ నెల 7న ప్రధాని మోడి కి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎంపి కవిత సోనోవాల్ కు కృతజ్ఞతతలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios