Asianet News TeluguAsianet News Telugu

13 వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు

 

  • 13 వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడు
  • ఆగస్టు 11న వెంకయ్య  ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
  • సిస్ట‌ర్స్ ఫ‌ర్ చేంజ్ కార్యక్రమం గొప్పతనాన్ని ప్రశసించిన  సెహ్వాగ్ 
  • వర్షాలు సమృద్దిగా కురవాలని పోచారం వరుణయాగం
  • ఆఫ్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ను అరెస్టు చేసిన డిల్లీ పోలీసులు
asianet telugu express  news in snippets
  13 వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు 

 

asianet telugu express  news in snippets

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ కు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయడు ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధిపై 272 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఆయన ఈ నెల 11 న 13 వ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణకు 244 ఓట్లు వచ్చాయి. శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్‌ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

దీంతో వెంటనే పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్‌ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది.  ఆగస్టు 11న ఆయన భారతదేశానికి 13వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎవరి అంచనాలకు అందకుండా వెంకయ్యానాయుడి ఎన్డీయే నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈయనపై పోటీ చేసిన మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీకి ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. లోక్‌సభలో మెజార్టి ఉన్న ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడి గెలుపు ముందుగా వూహించినదే.

బిజెపికి చెందిన ఉపరాష్ట్రపతులలో వెంకయ్య  రెండవ వాడు. మొదటి వ్యక్తి రాజస్థాన్ కు చెందిన బైరాన్ సింగ్ షెకావత్. ఆయన వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడు 2002-2007 మధ్య ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన వాజ్ పేయి,  ఎల్ కె అద్వానీ తరానికి చెందినవ్యక్తి. ఆయనకు గొప్ప బిజెపి నాయకుడిగా పేరుంది. 1952 నుంచి ఉప రాష్ట్రపతి గా ఎన్నికయ్యే ఆయన ఓడిపోయిన ఎన్నిక ఒక్కటే. అది కూడా 1972లో ఇందిగా గాంధీ ప్రభంజనంలో.  అంత్యోదయ పథకం  ఆయనదే. అప్పటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు మెక్ నమారా షెకావత్ ను రాక్ ఫెల్లర్ ఆఫ్ ఇండియా అని కొనియాడారు. షెకావత్ బాాగా మృదు స్వభావి.

దీనికి భిన్నంగా వెంకయ్యనాయుడు వాగ్ధాటి ఉన్న నాయకుడు. మాటకారి. ఆయన యతి ప్రాసలు తెలుగు నుంచి ఇంగ్లీష్ కూడా పాకాయి.బహుశా ఇలాంటి వాగ్ధాటి  ఉన్న వ్యక్తి ఉప రాష్ట్రపతిగా ఎపుడూ లేరేమో.

షెకావత్ కు వెంకయ్యకు ఉన్న తేడా... షెకావత్ ఎన్నికల యోధుడు. వెంకయ్య రెండుసార్లు మాత్రమే నాటి ఆంధ్ర శాసన సభకు ఎన్నికయ్యారు. ఆయన పార్లమెంటరీ కాలమంతా రాజ్యసభ నుంచే సాగింది. అయితే,  ఒక్క సారి కూడా ఆయన ఆంధ్రకు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించలేకపోయారు. ప్రతిసారి ఆయన కర్నాటనుంచి ఎన్నికవుతూ వచ్చారు. గత సారి మాత్రం రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

***  ***

ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మరి కాసేపట్లో ఫలితం తేలనుంది. కొద్దిసేపటి క్రితమే ముగిసిన పోలింగ్ లో మొత్తం 785 ఎంపీలలో 771 మంది ఓటేశారు. పోలింగ్ శాతం 98.21  గా నమోదైంది.14 మంది ఎంపీలు ఓటు వేయలేదు. వెంకయ్య గెలుపు ఖాయంగా కనబడుతున్నా అధికారికంగా ఏడు గంటలకు ఫలితాలు వెలువడననున్నాయి.
 

ఆప్ ఎమ్మెల్యే అరెస్టు

డిల్లీ లో అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి చెందిన ఈయన ప్రభుత్వ ఆస్తుల ద్వంసం చేస్తున్నాడని  స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు.  అయితే ఈ కేసు విచారణకు ఆయన కోర్టులో హాజరుకాకపోవడంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసారు.పటియాలా కోర్టులో హాజరుపర్చగా...ఈ నెల 17వ తేది వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.  
 

ఆర్మీలో చేరాలనుకునే తెలంగాణ అభ్యర్థులకు శుభవార్త

ఆర్మీ లో చేరాలనుకున్న తెలంగాణ అభ్యర్థులకు  సదవకాశం. వచ్చేనెల సెప్టెంబర్ 2 నుండి అక్టోబర్ 16 వరకు  అన్ని కేటగిరీల్లో ఆన్ లైన్ లో లో అప్లై చేసుకొనుటకు  ఆర్మీ వెబ్ సైట్ లో  స్లాట్ ఓపెన్ చేస్తున్నారు. అర్హతలు గల నిరుద్యోగులకు  ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. అభ్యర్థులకు ఎటువంటి సహాయం కావాలన్నా ఈ క్రింది నంబర్స్ కు ఫోన్ చేయగలరు. లేదా ఈ ఆఫీస్ కు వెళితే ఉచితంగా అప్లికేషన్  ప్రాసెస్ చేస్తారు.   
 అడ్రస్ :  GMK’S PREDEFENCE ACADEMY (P) LTD, KPHB COLONY, HYD – 72,

పోన్ నంబర్లు : 9849292668/9908393066/8555985159
వెబ్ సైట్ : WWW.JOININDIANYARMY.NIC.IN                       

వర్షాలకోసం పోచారం వరుణయాగం

asianet telugu express  news in snippets

రాష్ట్రంలో వర్షాల పుష్కలంగా కురవాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి  సతీసమేతంగా వరుణయాగం నిర్వహించారు.నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాలు  బాగా  కురిసి, పంటలు సమృద్దిగా పండాలని కాంక్షిస్తూ తానీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పోచారం తెలిపారు.                       

హర్యానా బీజేపి అద్యక్షుడి కుమారుని అరెస్టు

హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా  కొడుకు వికాస్‌ బరాలాపై ఛండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి కూతుర్ని వేధించినందుకు అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  వైద్యపరీక్షల్లో నిందితులు మద్యం తాగినట్టు  కావడంతో  వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఛండీగఢ్ పోలీసులు తెలిపారు.
 

బిగ్ బాస్ షో లో విషాదం


త‌మిళ బిగ్ బాస్ షో లో మరో విషాదం చోటుచేసుకుంది.  ఈ  బిగ్ బాస్ ఇంట్లో  పార్టిసిపెంట్ గా ఉన్న ఒవియా స్విమ్మింగ్‌పూల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన సృష్టించింది. తోటి కంటెస్టెంట్స్ అప్ర‌మ‌త్త‌మై ఒవియాని సుర‌క్షితంగా ర‌క్షించినట్లు సమాచారం. ఈ సంఘ‌ట‌న‌పై పోలీసులు కూడా సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.  
 

చంద్రబాబు కార్యాలయం మీద విరుచుకుబడ్డ ఐవైఆర్ కృష్ణారావు 

 

asianet telugu express  news in snippets



​ఆంధ్రప్రదేశ్ కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుూ ఉందని, కార్యాయలంలోని అధికారులు ముఖ్యమంత్రి వివిధ శాఖలకు చెందిన పైళ్ల మీద ఎలాంటి సలహాలందిస్తున్నది రికార్డు చేయడం లేదని, ఇది నియమాలకు వ్యతిరేకమని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. ఒకపుడు ముఖ్యమంత్రి కి సన్నిహితుడిగా ఉన్న కృష్ణారావు ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయలను ప్రోత్సహిస్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛెయిర్మన్ పదవి నుంచి తొలిగించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన ప్రభుత్వానికి సంబంధించి అనేక విషయాలు వెల్లడించారు.ఇపుడు ముఖ్యమంత్రి కార్యాలయం పనితీరు మీద విరుచుకుపడ్డారు.ఇందులో భాగమే నేడు ఆయన రాసిన ఎనిమిది పేజీల ఉత్తరం. దీని ప్రకారం సీనియర్ ఐఎఎస్ అధికారులున్న ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యతారహితంగా పనిచేస్తున్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

  జగన్ ను వెంటనే అరెస్టు చేయాలి - చింతమనేని

ముఖ్యమంత్రి చంద్రబాబుపై  జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో ప్రభుత్వ విప్ చింతమనేని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ దిష్టిబొమ్మను దహనం చేసారు., వెంటనే జగన్ ను అరెస్టు చేయాలంటూ దెందులూరు పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు.పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ లో మోదీ దిష్టిబొమ్మ దహనం

asianet telugu express  news in snippetsరాహుల్ గాంధీ పై జరిగిన రాళ్ల దాడికి నిరసనగా మహబూబ్ నగర్ లో మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్  సీహెచ్ విజయ్ కుమార్ ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు. మోదీ దిష్టిబొమ్మను పట్టణంలో ఊరేగించి,తర్వాత దహనం చేసారు. బీజేపీ పార్టీ గూండా కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఈ ఆందోళనలో ఎండి అల్తాప్(nsui ప్రెసిడెంట్).  కె కుమార్, బాలకృష్ణ, రావుఫ్ తదితరులు పాల్గొన్నారు.
 

సీఎం కేసీఆర్ హామీతో విడుదలైన నిధులు


 సీఎం కేసీఆర్ నిన్న పర్యటించిన కేశవపూర్, లక్ష్మాపూర్ గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు విడుదల తెలంగాణ ప్రభుత్వ జీవో జారీ చేసింది. కేశవపూర్ గ్రామాభివృద్ధికి రూ. 12.76 కోట్లు, లక్ష్మాపూర్ గ్రామానికి రూ. 27.76 కోట్లు నిధులను విడుదల చేసింది. 

ఇప్పటివరకు 90 శాతం పోలింగ్ పూర్తి  

ఉప రాష్ట్రపతి ఎన్నికలో  ఇప్పటివరకు 90.83 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి ముకుల్‌ పాండే తెలిపారు.  ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం ఓటర్ల సంఖ్య 790 ఉండగా దాదాపుగా అన్ని ఓట్లు పోలైనట్లుగా ఆయన తెలిపారు.అయితే పార్లమెంట్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.  రాత్రి 7 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.  

రేపు శ్రీవారిని దర్శించుకోనున్న వెంకయ్య

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి  వెంకయ్య నాయుడు రేపు తిరుపతికి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 

ఎంపీ కవితను అభినందించిన మాజీ క్రికెటర్ సెహ్వాగ్

asianet telugu express  news in snippetsమాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలంగాణ ఎంపీ క‌వితపై ప్ర‌శంస‌ల వర్షం కురిపించాడు. రాఖీ పండగ‌ సందర్బంగా క‌విత చేపడుతున్న సిస్ట‌ర్స్ ఫ‌ర్ చేంజ్ కార్యక్రమం గొప్ప ఆలోచన అని కితాబిచ్చారు. అన్నలకు హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వాల‌న్న ఎంపీ ఆలోచనతోపాటుగా, మీరు అభిమానించే వ్య‌క్తుల‌కు కూడా హెల్మెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని సెహ్వాగ్ సూచించాడు.
 

చిత్తూరు రోడ్ ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

శనివారం ఉదయం జరిగిన చిత్తూరు జిల్లా రోడ్ ప్రమాదంలో విదేశీయుల మృతిపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

ప్రమాదంలో ముగ్గురు స్పెయిన్ దేశస్థులు మరణించడం పట్ల విచారం. 

స్పెయిన్ దౌత్య కార్యాలయంతో సంప్రదించి  మృతుల వివరాలు తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి

  పాకిస్థాన్ క్యాబినెట్‌లోకి  హిందూ మంత్రి 

పాకిస్థాన్ క్యాబినెట్‌లో 20 సంవత్పరాల తర్వాత  ఓ హిందూ మంత్రి ని చూడబోతున్నాం.  తాత్కాలిక ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన  షాహిద్ అబ్బాసీ,  తన మంత్రిమండలిలో ద‌ర్శ‌న్ లాల్‌ కు చోటు కల్పించారు. పాకిస్థాన్‌లోని నాలుగు రాష్ట్రాలను ద‌ర్శ‌న్ లాల్‌ కోఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు.  సింధు ప్రావిన్సు నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు ద‌ర్శ‌న్ లాల్‌.   

 

"రాఖీ కట్టు-హెల్మెట్ ఇవ్వు" కార్యక్రమంలో పాల్గొన్న నాయిని 

'రాఖీ కట్టు-హెల్మెట్ ఇవ్వు' కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. నారాయణగూడలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయనకు విద్యార్థినులు రాఖీ కట్టారు. తర్వాత నారాయణగూడ చౌరస్తా నుంచి సుందరయ్య విజ్ఞానభవన్ వరకు విద్యార్థినుల ర్యాలీ నిర్వహించారు.
 

హైదరాబాద్ లో బీజేపి కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్

హైదరాబాద్: గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ పై జరిగిన దాడికి నిరసనగా నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయాన్నియూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాందీ పై జరిగిన దాడి భీజేపీ గూండాల నిర్వాకమేనని యూత్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు.  
 

తన ఇంటి వద్దే దీక్షను ప్రారంభించిన పొన్నం

పోలీసులు దీక్షకు అనుమతి నిరాకరించడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన ఇంటిముందే ఆమరణ దీక్షకు దిగారు. దీక్షకు మద్దతు తెలిపిన కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం  పూలమాలతో పొన్నంను సత్కరించారు.అలాగే దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున, వాహనదారులకు అంతరాయం కలుగుతుందనే దీక్షకు అభ్యంతరం తెలిపినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
 

కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి శివకుమార్ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

 
కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఇండ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వంద కోట్ల వరకు అక్రమాస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇంకా కొన్ని లాకర్లను, బ్యాంకు అకౌంట్ లు గుర్తించామని అదికారులు తెలుపుతున్నారు. అయితే వాటిలో బారీ మొత్తంలో డబ్బులు, ఆస్తుల పత్రాలు ఉంటాయని భావిప్తున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఐతే ఈ దాడులను 
 

 మెగాస్టార్ తో టిఆర్ ఎస్ ఎంపి కవిత

ఢిల్లీలో నేడుజరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భగా తెలంగాణా నిజాంబాద్ ఎంపి కవిత కాంగ్రెస్ సభ్యుడు మెగా స్టార్ చిరంజీవిని కలుసుకున్నారు.

ఇది సెల్ఫీ. దీనిని కవిత్ షేర్ చేశారు.

asianet telugu express  news in snippets

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటేసిన పీఎం నరేంద్ర మోద

asianet telugu express  news in snippets

పార్ల‌మెంట్‌లో జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో ప్ర‌ధాని మోదీ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఎన్డీఏ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా  వెంక‌య్య‌నాయుడు,  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్‌లు కూడా పార్ల‌మెంట్‌ లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కోసం కేంద్రమంత్రులు, సీనియర్ నేతలు సహా ఎంపీలంతా ఇప్పటికే పార్లమెంటుకు తరలి వచ్చారు.

 సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

  పాతబస్తీలో కార్డన్ సెర్చ్

పాతబస్తీని అడ్డాగా మార్చుకున్న నేరస్థులను అదుపుచేసేందుకు దక్షిణ మండలం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో  పొద్దున 5 గంటల నుండి 8 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు. 250 మంది  పోలీసులు పాల్గొన్న ఈ సెర్చ్ లో  84 మంది అనుమానితులను,     కల్తీ ఆహార పదార్థాలు తయారీ ముఠాతో పాటు,  56 వాహనాలను స్వాధీనపర్చుకున్నారు.  

తెలంగాణ వజ్రబస్సులలో రు.25 రాయితీ

ప్రయాణికుల ఆకట్టుకునుందకు తెలంగాణ ఆర్టీసీ ఒక ఆఫర్ ప్రకటించింది.  హైదరాబాద్‌ లోని వివిధ కాలనీల నుంచి నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు వెళ్లే వజ్ర మినీ ఏసీ బస్సులలో రు.25 కన్సెషన్ లభిస్తుంది.  వజ్ర బస్సుల్లో ప్రయాణించే వారు మొబైల్‌ యా్‌పతో టికెట్లు బుక్‌ చేసుకుంటే ఒక్కోదానిపై రూ. 25 రాయితీ ఇవ్వనున్నట్టుటిఎస్ ఆర్ టిసి  తెలిపింది. వజ్ర బస్సుల్లో వెళ్లేవారు ముందస్తు టికెట్లు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే...ప్రయాణికుడికి మొదటి 4 సార్లు మాత్రమే ఈ రాయితీ లభించనుంది. ఈ రాయితీ సేవలు శనివారం(ఆగస్టు-5) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి.

 

చిత్తూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

చిత్తూరు జిల్లా ఈడిగెపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సును కంటైనర్ డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  మదనపల్లి మండలం పుంగనూరు దగ్గర యాతాల వంకకాడ ఎదురెదురుగా వస్తున్న సమీపంలో టెంపో, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పెయిన్ దేశస్తులు చనిపోయారు. ప్రమాదస్థలంలోనే లోనే నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. వీళ్లు అనంతపురంలో ఉన్న రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్(ఆర్ డి టి) కు వచ్చారు. అక్కడి నుంచి పాండిచ్చేరికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారు మదనపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పొన్నం దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు

కరీంనగర్:  కరీంనగర్ మాజీ కాంగ్రెస్  ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆమరణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కరీంనగర్లో మెడికల్ ప్రభుత్వం కాలేజీని ఏర్పాటుచేయాలని కోరుతూ ఆయన శనివారం నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. ఎలాగైనా దీక్ష చేసి తీరుతానని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆయన్న అరెస్టు చేసే అవకాశం ఉంది.

తెలుగు భాష  కొచ్చిన ముప్పేమీ లేదు

కొన్ని భాషలు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలోని  మొత్తంగా మాట్లాడే  6000 భాషలలో  2050 ఏడాదికల్లా 4000 భాషలు మెల్లి మెల్లాగా అంతరించే ప్రమాదం  ఉందని భాషాశాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వీటిలో పదిశాతం భారతీయ భాషలున్నాయి. ప్రస్తుతం భారత దేశంలో 780 భాషలను మాట్లాడుతుంటే రాబోయే 35 ఏళ్లలో 400 వరకు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడే హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠి, కన్నడ, మలయాళం, గుజరాతి, పంజాబీ భాషలకు అటువంటిప్రమాదమేమీ లేదని  లేదని, ఈ భాషలకు వేలాది ఏళ్ల చరిత్ర ఉండడంతో ఈ జాబితాలోకి  రావనినిపుణులు చెబుతున్నారు.  వీటిపై ఇంగ్లిష్‌ భాష ప్రభావమున్నా ఇవి క్షీణిస్తాయన్న భయం అవసరం లేదని పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (పీఎల్‌ఎస్‌ఐ) చెబుతూ ఉంది. ఈ సంస్థ 27 రాష్ట్రాల్లోని 780 భాషలపై 3000 మందితో అధ్యయనం చేసింది. ఈ పరిశోధనకు సంబంధించిన 11 సంపుటాలను ఇటీవల ఢిల్లీలో విడుదల చేసింది.

***  ***

ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే

న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికలు మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్నాయి.  పార్ల మెంటు హాలులో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5వరకు జరగనున్న పోలింగ్‌లో ఎన్నికైన, నియమితులైన ఉభయ సభల ఎంపి లు ప్రత్యేకమైన కలం ద్వారా తమ ఓటు హక్కు ను వినియోగించుకుంటారు. భారతదేశ తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరనేది రాత్రి 7 కల్లా తెలిసి పోతుంది. ఈ ఎన్నికలు రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతున్నందు వల్ల రాజకీయ పార్టీ లు విప్‌ను జారీ చేయడానికి వీల్లేదు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్‌డిఎ అభ్యర్థిగా బిజెపి సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా  గోపాలకృష్ణ గాంధీ పోటీ చేస్తున్నారు.

***  ***

శ్రీవారికి శివ్ నాడార్ కోటి రుపాయల విరాళం

 

తిరుమల: తిరుమల శ్రీవారికి భారతీ సాఫ్ట్వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌నాడార్‌ రూ.కోటి విరాళాన్ని అందచేశారు. ఎలాంటి సందడి లేకుండా ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై (రూ.300) సుపథం నుంచి ఆలయానికి శుక్రవారం రాత్రి చేరుకుని శ్రీవారిని మహాలఘు స్థానం నుంచి దర్శించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపానికి చేరుకుని తిరుమల జేఈవో శ్రీనివాసరాజుకు రూ.కోటి విరాళపు చెక్కులను అందచేశారు. బర్డ్‌ ట్రస్టుకు విరాళం మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని సూచించారు. నాడార్‌ను తిరుమల జేఈవో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు.

 

***   ***

విశాఖ పెట్రోలియం యూనివర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ) బిల్లు– 2017ను లోక్‌సభ ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఇప్పటికే విశాఖలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమైన ఐఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిస్తూ వర్సిటీని ఇన్‌కార్పొరేట్‌ చేసేందుకు గానూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్‌ శుక్రవారం సభలో బిల్లు ప్రవేశపెట్టారు. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీ కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల స్థలమిచ్చిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 

*** ***

పది రుపాయల నాణేలను తీసుకొనకపోతే చర్యలు

asianet telugu express  news in snippets

పాలకొల్లు: పది రూపాయల నాణేలను బ్యాంకు అధికారులు, వ్యాపారస్థులు  తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తే కఠిన  చర్యలుంటాయి.  ఈ విషయాన్ని  ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌( హైదరాబాద్‌) సుబ్రహ్మణ్యన్‌ చెపారు. స్పష్టం చేశారు. శుక్రవారం పాలకొల్లు పంచారామ క్షేత్రంలోని క్షీరా రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆంధ్రాబ్యాంక్‌ కౌంటర్‌ ద్వారా రూ. 2 వేలు, రూ. 500 నోట్లకు చిల్లర నాణేలను ఆయన అందజేశారు. తర్వాత నగదు కొరత, రూ.10 తీసుకోకపోవడంపై పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. రూ.10 నాణేలను దుకాణదారులు కూడా తీసుకొని నగదు మార్పిడికి సహకరించాలని కోరారు. ఏదైనా బ్యాంకుల నుంచి సమస్యలు తలెత్తితే ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయాలని చెప్పారు.

 

***  ***

Follow Us:
Download App:
  • android
  • ios